Budh Gochar 2023: నవరాత్రుల తర్వాత ఈ 5 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా..?

Budh Gochar 2023: ఈనెల చివరిలో బుధుడి రాశిలో పెను మార్పు రాబోతుంది. మెర్య్కూరీ సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 04:09 PM IST
Budh Gochar 2023: నవరాత్రుల తర్వాత  ఈ 5 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా..?

Budh Rashi Change will Happen on 31st April 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. నవరాత్రుల తర్వాత గ్రహాల రాకుమారుడిగా పిలవబడే బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 31న మధ్యాహ్నం 3.28 గంటలకు బుధుడు అంగారకుడి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతుంది. అదే రాశిలో జూన్ 07 వరకు బుధుడు ఉంటాడు. బుధుడి యెుక్క ఈ గోచారం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
బుధుడు మేషరాశి ప్రవేశం వల్ల మీలో ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

మిధునరాశి
మిథున రాశి వారికి బుధ సంచారం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. 

కర్కాటక రాశి
మీ మాటలు మరియు పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీడియా, చిత్ర పరిశ్రమ లేదా కళారంగంలో అనుబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. 

సింహరాశి
సింహ రాశి వారు తమ కెరీర్‌లో ముందుకు సాగుతారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

మీనరాశి
బుధుడి గోచారం వల్ల వ్యాపారులు భారీగా లాభపడతారు. పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులకు మద్దతుదారులు పెరుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి వారికి కాలం కలిసి వస్తుంది. 

Also Read: Shukra Gochar 2023: వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. 

Also Read: Rahul Gandhi Eviction Notice: ఎవిక్షన్ నోటీసుపై స్పందించిన రాహుల్, ఆ జ్ఞాపకాలు పదిలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News