Saturn, Mars, Venus Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశిని శని గ్రహం అధిపతిగా వ్యవహరించే రాశిగా పరిగణిస్తారు. అయితే గతంలోని కుంభ రాశిలో శని గ్రహం ప్రవేశించింది. ఆ తర్వాత ఇటీవలే శుక్రుడు రాశి సంచారం చేశాడు. ఇక మార్చి 15వ తేదీన గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే కుజుడు కూడా సంచారం చేశాడు. దీని కారణంగా కుంభరాశిలో శుక్ర, కుజ, శని గ్రహాల కలయిక ఏర్పడింది. అయితే ఈ గ్రహాల కలయిక ఏర్పడడం కారణంగా మొత్తం 30 రోజులపాటు ప్రత్యేక ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మూడు గ్రహాలు జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనేక రకాల ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు గ్రహాలు కలయిక కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన ప్రత్యేక ప్రభావం మేష రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి కారణంగా ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. అలాగే సానుకూల ఆలోచనలతో పనులు చేయడం వల్ల విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఎలాంటి పనులైన గొప్ప ఆలోచనలతో ఈ సమయంలో సులభంగా చేయగలిగే శక్తిని పొందుతారు. అయితే వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది.
మేషరాశి:
కుంభరాశిలో శుక్ర పూజ శని గ్రహాల కలయిక కారణంగా మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరులపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంటారు దీని కారణంగా మంచి లాభాలు పొందుతారు. అలాగే వీరు పిల్లలనుంచి కూడా కొత్త శుభవార్తలు వింటారు. వ్యాపార జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. దీంతో మేష రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
మకర రాశి:
ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే ప్రభావం మకర రాశి వారిపై కూడా సమానంగా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి కారణంగా జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేగాకుండా వైవాహిక జీవితం గడిపే వారికి ఈ సమయం ఎంతో శృంగార భరితంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తప్పకుండా ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ భాగస్వామి కెరీర్ జీవితం గురించి గొప్ప బాధ్యతలను పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి