Viral Video: ట్రెండ్ మారింది.. పెళ్లి విందులో మహిళలకు మందు సప్లై.. వైరల్ అవుతున్న వీడియో..

Trending Video: పెళ్లిలో మగవాళ్లకు మందు పార్టీలు ఇవ్వడం కామన్. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి విందు మాత్రం డిఫరెంట్. ఇక్కడ వివాహ విందులో పురుషులతోపాటు మహిళలకు కూడా భోజనంతోపాటు మద్యాన్ని కూడా వడ్డిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 11:12 PM IST
Viral Video: ట్రెండ్ మారింది.. పెళ్లి విందులో మహిళలకు మందు సప్లై.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video today: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. రోజూ కొన్ని వేల వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీడియో వినూత్నంగా ఉంటే చాలు నెటిజన్స్ ఎగబడి చూస్తున్నారు. ఈ మధ్య చిత్రవిచిత్ర వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. సాధారణంగా పెళ్లి విందుకు వచ్చిన వారికి కూల్‌డ్రింక్స్‌, భోజనాలు, రకరకాల స్నాక్స్ పెడుతుండటం చూసూంటాం. కానీ అతిథులకు ఆహారంతో పాటు మద్యం వడ్డించటం మీరు ఎప్పుడైనా చూశారా? అది కూడా మహిళలకు. చూడకపోతే ఈ కింద ఉన్న వీడియో చూసేయండి. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ఓ పెళ్లిలో మహిళలు పంక్తి భోజనం చేస్తుంటారు. భోజనం చేస్తున్న వారికి కొందరు మహిళలు గ్లాసుల్లో మద్యం అందిస్తుంటారు. వారు కూడాతాగేస్తుంటారు. మనం పెళ్లిల్లో మగవాళ్లను తాగడం చూసుంటాం. కానీ ఇంత మంది ఆడవాళ్లు తాగడం చూసి ఉండం. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను @HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నెటిజన్స్ తమదైన శైలిలో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మహిళలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఒకరంటే.. అక్కడ పురుషులెవరూ కనిపించడం లేదని మరొకరు కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారు, ఆ మహిళలు ఎవరనేది వెల్లడి కాలేదు.

Also Read: Viral Video today: ఈ పాము మినరల్ వాటర్ తప్ప జనరల్ వాటర్ తాగదట.. వైరల్ అవుతున్న వీడియో..  

Also Read: Viral Video: ఇది మాములు టాలెంట్ కాదు బ్రో.. కుర్రాళ్లు ఏటీఎంలో చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News