Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!

Monkey Drinking Coke: కొన్ని కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. జంతువుల్లో కెల్లా కోతులు తెలివి కలిగిన జంతువులని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని నిరూపించే విధంగా ఈ కోతి ప్రవర్తన ఉంది. జనావాసాల్లో సంచరిస్తున్న కొన్ని కోతులు శీతల పానీయం బాటిల్ లోని ద్రావణాన్ని తాగేందుకు ప్రయత్నించగా.. ఓ కోతి వచ్చి అచ్చం మనిషిలాగ కూర్చొని ఆ కూల్ డ్రింక్ ను కాజేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 01:55 PM IST
    • మనిషిలా కూల్ డ్రింక్ తాగుతున్న కోతి
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్
    • ఆకట్టుకుంటున్న వానరం రియాక్షన్స్
Monkey Drinking Coke: కూల్ డ్రింక్ ఇలా తాగాలిరా బచ్చా.. చూసి నేర్చుకో!

Monkey Drinking Coke: ప్రపంచంలోని జంతువుల్లో కోతులు తెలివైనవి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దాన్ని నిరూపించే విధంగా కొన్ని కోతులు వాటి వాటి తెలివి తేటలతో మనుషులను మించిపోయేలే కొన్ని పనులు స్మార్ట్ గా చేసేస్తున్నాయి. అలాంటి ఓ మేధావి కోతి వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. 

మేధావి కోతి అని ఎందుకు అన్నామో ఒకసారి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. దాని తెలివితేటలు ఎలా ఉపయోగించిందో? అచ్చం మనిషిలాగే శీతల పానీయాన్ని తాగుతూ, కెమెరా కంట పడింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 

వీడియోలో ఏముంది?

ఓ ఊర్లోని జనావాసాల్లోకి వచ్చిన కోతుల గుంపు ఆహారం కోసం వెతుకులాడుతున్నాయి. అంతలోనే వాటికి ఓ శీతల పానీయానికి సంబంధించిన బాటిల్ కంటపడింది. అందులోని పానీయాన్ని తాగేందుకు కోతులు కష్టపడ్డాయి. 

ఆ గుంపులోని ఓ వానరం అందులోని పానీయాన్ని ఎలా తాగాలో తెలియక.. కింద పోసి దాన్ని మెల్లిగా తాగుతుంది. అంతలోనే ఆ శీతల పానీయాన్ని గమనించిన మరో కోతి.. అంతటితో ఆగకుండా, ఆ బాటిల్ ను లాక్కొని పానీయం తాగుతున్న కోతిని తరిమింది. 

అప్పుడు ఆ శీతల పానీయ బాటిల్ ను తీసుకొని.. అచ్చం మనిషిలా రెండు చేతులతో పైకెత్తి గటగట తాగేసింది. ఒక్క దెబ్బకి అందులోని పానీయాన్ని కాజేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.  

Also Read: Husband Wife Funny Videos: నిద్రపోతున్న భర్తతో భార్య ఏం చేసిందో చూడండి!

Also Read: Viral snake video: పాము​కు కోపమోస్తే ఎంత వేగంగా కాటేసిందో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News