Huge Snake Viral Video: బోరుబావు లాంటి గోతులు తీసే పాములను చూశారా? ఈ వీడియో చూస్తే కంగు తింటారు!

Snake Digging Hole Viral Video: సాధారణంగా ఎలుకలు గోతులను తవ్వుతంటాయని మన అందరీకి తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా గోతులు తీసే పాము చూశారా..? ఈ వైరల్‌ వీడియో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఏంటి పాము గోతులు కూడా తవ్వుతుందా అని ఆశ్చర్యపోతారు.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 15, 2024, 05:51 PM IST
Huge Snake Viral Video: బోరుబావు లాంటి గోతులు తీసే పాములను చూశారా? ఈ వీడియో చూస్తే కంగు తింటారు!

Snake Digging Hole Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. సాధారణంగా  పాములకు సంబంధించిన మరి కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని భయానకంగా ఉంటాయి.  పాములు చెట్టు నుంచి చెట్టుకు దూకడం లేదా ఎగరడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు తిరుగుతుంటాయి. కానీ  బోరుబావు లాంటి గోతులు తీసే పాములను మీరు ఎప్పుడైనా చూశారా..? పాములు గోతులు తీయడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నది నిజమే.. 

కొన్ని రకాల పాములు గొయ్యి తవ్వుకుంటాయి. అయితే అన్ని పాములు గొయ్యి తవ్వుకోవు. కొన్ని రకాల పాములు భూమిలో గుహలు తవ్వి అందులో  నివాసము చేసుకుంటాయి. ఇలా చేయడానికి వాటికి పదునైన దంతాలు  బలమైన శరీరం ఉంటుంది.  అయితే ఈ పాములకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  పాములు సాధారణంగా తమ ఆహారం కోసం లేదా ఆశ్రయం కోసం బొరియలు తీస్తాయి. కానీ రోడ్డుపక్కన ఉన్న బొరియను పాము తవ్వుతున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో శ్రద్ధగా తన తల, శరీరంతో భూమిలో రంధ్రంను తీసుకుంటుంది. రంధ్రం తీస్తున్న కొద్ది మట్టి మళ్లీ మళ్లీ గుంతలోకి పడిపోవడం వల్ల పాము మట్టిని మళ్లీ తవ్వుతుంటుంది. ఈ వీడియోను సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్‌ చేయడంతో నెటిజన్‌లు షాక్‌కు గురవుతున్నారు. గతంలో ఎలుకలు, తాబేళ్ళు మాత్రమే  బొరియలను చేసేవి కానీ ఇప్ప్పుడు పాములు కూడా సౌకర్యవంతంగా ఉండేలాగోతులు తీసుకుంటున్నా అని  సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ క్యాప్షన్  చేశారు. వీడియో షేర్‌ చేసిన మరి కొద్ది నిమిషాల్లో చాలా మంది రియాక్ట్ అయ్యారు. కొందరు ఆశ్చర్చపోయారు. 

 

 

గొయ్యి తవ్వు పాముల ప్రత్యేకతలు:

చాలా రకాల పాములు భూమి కింద గుహలు, బొరియలు తవ్వి తమ నివాసంగా చేసుకుంటాయి. ఇవి ప్రధానంగా ఎడారి ప్రాంతాలు, గడ్డి మైదానాలు, అడవులలో కనిపిస్తాయి. మరి కొన్ని రకమైన పాములు రాళ్ల కింద, చెట్ట వేర్ల మధ్య ఉంటాయి. అయితే ఈ గుంతలు తవ్వే పాములు ఆహారం కోసం, గూడు కట్టుకోవడానికి, శత్రువుల నుంచి రక్షణ కోసం గుహలు తవ్వుతాయి. ఈ పాములు గుండ్రంగా, తల చిన్నగా ఉంటుంది. వీటి దవడలు మట్టిని తవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే  ఈ పాములు సాధారణంగా ఒంటరిగా ఉంటాయి.  కొన్ని జాతులు శీతల రుతువులో గుంపులుగా ఉంటాయి. ఈ పాములో కొన్ని ప్రసిద్ధమైన జాతులు కూడా ఉన్నాయి. 

కొన్ని ప్రసిద్ధమైన జాతులు:

రత్నసర్పాలు: భారతదేశంలో కనిపించే ఈ పాములు తమ అందమైన రంగుల కోసం ప్రసిద్ధి చెందాయి.

కోబ్రాలు: విషపూరితమైన ఈ పాములు తమ గొంతును విస్తరించి భయపెడతాయి.

వైపర్లు: విషపూరితమైన ఈ పాములు త్రిభుజాకారపు తలతో ఉంటాయి.

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News