Monkey Gives a Hug: మనిషిని హత్తుకుంటూ భావోద్వేగానికి లోనైనా కోతి

Monkey Climbs on Tourist's Arms: జంతువులు కూడా భావోద్వేగానికి గురవుతూ ఉంటాయి. అవి కూడా తమ ఎమోషన్స్‌ను వ్యక్తం చేయగలవు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 05:15 PM IST
  • జంతువులు కూడా భావోద్వేగానికి లోనవుతాయి..
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • మనిషితో ఎంతో ప్రేమగా మెలిగిన కోతి
Monkey Gives a Hug: మనిషిని హత్తుకుంటూ భావోద్వేగానికి లోనైనా కోతి

Viral Video: ఒక వ్యక్తితో ఒక కొండముచ్చు కోతి ఎంతో ప్రేమగా మెలిగిన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. మనుషులకు, జంతువులకు మధ్య ఉండే బాండింగ్‌ను ఈ వీడియో తెలుపుతుంది. 

బాల్కనీలో కుర్చీ మీద కూర్చొన్న వ్యక్తిపైకి ఒక కోతి (Monkey) డైరెక్ట్‌గా వచ్చి చేరింది. అతని ఒళ్లో కూర్చొని హత్తుకుని ఉండిపోయింది. ఆ కోతి అలా అతని ఒళ్లోకి రాగానే ఆయన కూడా దాన్ని ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. దాన్ని నిమురుతూ ఉండిపోయాడు. ఆ స్పర్శకు కోతి కూడా ఎంతో ఆనందానికి లోనైంది. ఏదో బాధలో ఉన్న ఆ కోతి దాని నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అనిపించింది.

గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ అయిన ఈ వీడియో (Video) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ అనేది యూనివర్స్‌ల్ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. మెక్సికోలో (Mexico) ఒక ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్లగా ఈ ఘటన జరిగిట్లు తెలుస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Good News Movement (@goodnews_movement)

 

Also Read: Harish Rao: మంత్రి హరీశ్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత... అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

ఇక ఈ వీడియో చూసిన జనం కూడా పలు కామెంట్స్ చేస్తున్నారు. కోతిని (Monkey) దగ్గరకు తీసుకున్న ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.

Also Read: Australian Open - Nadal: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్లో నాదల్.. చరిత్రకు అడుగు దూరంలో స్పెయిన్‌ దిగ్గజం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News