Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో..

Facts About Sundar Pichai | సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారత దేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. 

Last Updated : Nov 28, 2020, 06:46 PM IST
    • సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్.
    • శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి.
    • దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.
Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో..

Jourey of Sundar Pichai | సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.

ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?

ప్రపంచంలో అత్యంత పాపులర్ సెర్చ్ ఇంజిన్, ఎక్కుమంది వాడే బ్రౌజర్ అయిన గూగుల్ (Google), స్మార్ట్ ఫోన్స్ గతిని మార్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ (Android).. ఇలా సుందర్ ప్రస్థానం విజయాల మయం. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ పది పాయింట్స్ లో..
1. తమిళనాడులో..
తమిళనాడులోని మదురైలో 1972 జూన్ 10న జన్మించారు సుందర్ పిచాయ్.

2. విద్యాభ్యాసం
ప్రాధమిక విద్యాభ్యాసాన్ని చెన్నైలోని జవహర్ విద్యాలయలో  పూర్తి చేశారు.

ALSO READ| Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
 3.తన కష్టంతో...
ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరారు సుందర్

4. విదేశీ విద్య...
అనంతరం అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్ (Sundar Pichai) అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

5. అలా మొదలైంది..
సుందర్ పిచాయ్ అంటే ముందు గూగుల్ గుర్తుకు వస్తుంది. నిజానికి 2004లో గూగుల్ సంస్థలో పని చేయడం ప్రారంభించారు.

ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
 6.మొదటి బాధ్యత
గూగుల్ సంస్థలో చేరిన తరువాత ఆయన చేపట్టిన తొలి ప్రాజెక్టు క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్ దీన్ని అద్భుతంగా డెవలెప్ చేసి చూపించారు. తన సత్తా చాటారు.

7. ప్రమోషన్
క్రోమ్ బ్రౌజర్ (Chrome)  డెవలెప్ చేపిన విధానాన్ని చూసిన గూగుల్ (Google Inc)సంస్థ.. 2008 లో ప్రొడక్ట్ డెవలెప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ‌నియమించారు

8. భార్య సలహాతో 
2011 లో ఆయనకు ట్విటర్ నుంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ట్విటర్‌లో చేరవద్దని అయన భార్య అంజలి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని సుందర్ స్వయంగా తెలిపారు.
Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ? 
9. టర్నింగ్ పాయింట్
ఏ బాధ్యత ఇచ్చినా చక్కగా నిర్వర్తించే సుందర్ 2015 లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు 
10. మరో బాధ్యత
2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా బాధ్యతలు స్వీకరించారు. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్ నేడు తన శ్రమ, అంకితభావంతో లక్షలాదిమందికి ప్రేరణగా నిలిచారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News