Rice, Salt in Mid-day Meal: అన్నం, ఉప్పుతోనే మధ్యాహ్న భోజనం.. ఇది కూడా ఒక తిండేనా!!

Rice, Salt in Mid-day Meal: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది.  మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది.

Written by - Pavan | Last Updated : Sep 29, 2022, 11:13 PM IST
  • కేవలం అన్నం, ఉప్పుతోనే మధ్యాహ్న భోజనం
  • చెట్టుకిందే మట్టిలో మధ్యాహ్న భోజనం.. కాదు కాదు.. అన్నం, ఉప్పు మాత్రమే
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Rice, Salt in Mid-day Meal: అన్నం, ఉప్పుతోనే మధ్యాహ్న భోజనం.. ఇది కూడా ఒక తిండేనా!!

Rice, Salt in Mid-day Meals: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది.  మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం వెనుకున్న లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేశం నలుమూలలా కొంతమంది అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్స్, మిడ్-డే మీల్స్ కాంట్రాక్టర్ల అవినీతి కారణంగా ఈ మధ్యాహ్న భోజనం పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. మిడ్ డే మీల్స్‌లో ఒడ్డించే భోజనం చూస్తే.. ఇది కూడా ఒక తిండేనా అని అనిపించేంతలా.. ఇలాంటి తిండి తింటే పిల్లల పౌష్టికాహారం లోపం దేవుడెరుగు వారి పరిస్థితేం కాను అని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందే దుస్థితి దాపురించింది.

ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు ఒడ్డిస్తున్న మధ్యాహ్న భోజనంలో కేవలం ఉత్త తెల్ల అన్నం, ఉప్పు మాత్రమే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పౌష్టికాహారం అనే పదానికి అర్థం లేకుండా... కోడి గుడ్డు, పాలు, పండ్లు లాంటివి కాదు కదా కనీసం కూరగాయలు కూడా లేకుండానే కేవలం అన్నం, ఉప్పుతో సరిపెట్టడం అక్కడి అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్స్, కాంట్రాక్టర్ల అవినీతికి అద్దం పడుతోంది. 

ఎలాంటి కనీస వసతులు లేకుండా చెట్టు కింద మట్టిలోనే కూర్చుని తమ దౌర్భాగ్యం ఇంతేనని సరిపెట్టుకుని తెల్లన్నం, ఉప్పుతోనే కడుపునింపుకుంటున్న ఈ చిన్నారుల బంగారు భవిష్యత్ ఏం కానుందో అర్థం కాని పరిస్థితి దాపురించింది. 

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో చర్యలకు ఆదేశించిన సర్కారు
ఒక పేరెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఈ వీడియో చూసిన తల్లిదండ్రుల ప్రాణం తల్లడిల్లిపోతోంది. అధికారుల అవినీతిని చూసి వారి కడుపు మండిపోతోంది. పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమవుతున్నట్టు అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాల ముందు ధర్నా చేపట్టి పాఠశాల సిబ్బందిపై నిరసన వ్యక్తంచేశారు.

Also Read : Received Potatoes on Meesho: ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఏమొచ్చాయో చూడండి

Also Read : Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News