Dog's reaction to run in opposite directions challenge: పెంపుడు జంతువులు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు ? ముఖ్యంగా శునకాలు అంటే ఇష్టపడని వాళ్లుండరు. అవి మనుషుల పట్ల చూపించే విశ్వాసం, ప్రేమ, స్పందించే తీరు ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే వాటి పట్ల వాటిని పెంచుకునే యజమానులు కూడా అదే రకమైన అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు. యజమానులతో పెంపుడు జంతువులకు కూడా అటువంటి అనుబంధమే కలిగి ఉంటాయి. యజమాని ఇంట్లో నుంచి బయటికెళ్తే.. గేటు వరకు వెంట వెళ్లేది మొదలు.. యజమాని బయటి నుంచి తిరిగి ఇంటికొచ్చే వరకు వాళ్ల కోసమే ఎదురుచూస్తున్నట్టు ప్రవర్తించే తీరు ఇంకా అదుర్స్ అనిపిస్తుంది.
అయితే, తమ కుటుంబంలో ఒకదానిలా పెంపుడు జంతువులను చూసుకునే వారిలో ఎవరికో ఓ కొత్త ఆలోచన వచ్చింది. యజమాని, యజమానురాలు.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరినే ఎంచుకునే సందర్భం వస్తే శునకం ఎవరిని ఎంచుకుంటుందా అని చెక్ చేయాలని అనుకున్నారు. అలా ఒకరికి తట్టిన ఆలోచనే ఆ తర్వాతి కాలంలో ''రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఛాలెంజ్'' (Run in opposite directions challenge videos) అనే ఛాలెంజ్ పేరుతో టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వైరల్‌గా మారడానికి కారణమైంది. కొంత మంది తమ పిల్లలపై, ఇంకొంత మంది తమ శునకాలపై ఈ ఛాలెంజ్ ప్రయోగించి చూస్తున్నారు.
Also read : Snake in lungi: 6 అడుగుల పామును పట్టి లుంగీలో వేసుకున్నాడు
ఈ రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఛాలెంజ్‌లో భాగంగానే ఇదిగో ఓ జంట ఈ వీడియోలో కనిపిస్తున్న మాదిరిగా శునకాన్ని మధ్యలో నిలబెట్టి.. చెరోవైపు పరుగుతీశారు. అది చూసి ఏం జరుగుతుందో అర్థం కాని శునకం మార్చిమార్చి ఇద్దరి వైపు చూస్తూ, ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక అలా మధ్యలోనే నిలబడిపోయింది. అంటే తన దృష్టిలో ఇద్దరూ సమానమేనని ఆ శునకం చెప్పకనే చెప్పిందన్న మాట. అయితే, అంతటితో ఆగని ఆ శునకం.. తమ యజమానుల వైపు తిరిగి చూస్తూ, అక్కడే ఉండి అరుస్తూ ఉన్నచోటే ఉండి గింగిరాలు కొట్టడం మొదలుపెట్టింది.
Lmaooooooo dogs are the best 😍😍 pic.twitter.com/0IQxggy4Fk
— Queen 👑 (@jadastackhouse) May 23, 2021
మొదట టిక్ టాక్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఛాలెంజ్ వీడియో తర్వాత ట్విటర్‌లోనూ వైరల్‌గా (Viral videos) మారింది. ఈ వీడియో మీకూ కూడా నచ్చింది కదూ!!
Also read : Viral Video: తిరుపతి రైల్వే స్టేషన్‌లో హీరోగా మారిపోయిన RPF కానిస్టేబుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి