Parrot missing in ayodhya: చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులు ఇతర జీవుల్ని పెంచుకుంటారు. మరికొందరు ఏనుగులు, మేకల్ని సైతం పెంచుకుంటారు. ఇటీవల కాలంలో మరీ వయోలేంట్ గా క్రూర జంతువుల్ని సైతంపెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జంతువులు కూడా తమ ఓనర్స్ పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. యజమానులు కూడా తాము పెంచుకుంటున్న కుక్కలను, పిల్లుల్ని... ఒక్క నిముషం కూడా అస్సలు విడిచిపెట్టి ఉండరు. తమతోపాటు తీసుకెళ్తుంటారు.
మూగ జీవాలు సైతం .. తమ యజమానులు కన్పించకుంటే.. అన్నం తినడం కూడా మానేస్తాయి. కొంత మంది అరుదైన రామచిలుకలను కూడా పెంచుకుంటారు. రామచిలుకలు మిగతా పక్షుల్లా కాకుండా.. మాట్లాడతాయి. అవి కొత్త వారిని గుర్తుపడతాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఇంట్లోపెంచుకుంటున్న రామచిలుక తప్పిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని ఒక ఫ్యామిలీ రామచిలుకను పెంచుకుంటున్నాు. ఫైజాబాద్ లోకి నీల్ విహార్ కాలనీకి చెందిన శైలేష్ కుమార్.. తన ఇంట్లో రామచిలుకను తెచ్చుకున్నాడు. దానికి ముద్దుగా మిత్తు అని పేరుపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రామ చిలుక కూడా ఇంట్లో వాళ్ల మాటల్ని సైతం ఇమిటేట్ చేసేది.
కొత్త వాళ్లు వస్తే ఇంట్లో వాళ్లను అలర్ట్ చేసేంది. అది రామ.. రామ అనికూడా భజన చేసేందంట. దాని మెడచుట్టు ఎర్రటి వలయం కూడా ఉందంట. అయితే.. ఇటీవల రామచిలుక ఒక్కసారిగా ఇంట్లో నుంచి ఎగిరిపోయింది. అది నార్మల్ గాఎగిరిన తిరిగి తన ఇంటికి వచ్చేసేది కానీ.. ఏమైందో ఏమో కానీ.. ఇటీవల రామచిలుక మాత్రం మరల రాలేదు. అదికన్పించకుండా పోయింది.
ఈ క్రమంలో దాని ఓనర్ రామచిలుక జాడను చెప్పినవారికి పదివేల రివార్డు సైతం ఇస్తామని కూడా ప్రకటన చేశారు. దీంతో రామచిలుక ఘటన కాస్త వార్తలలో నిలిచింది. ఎలాగైన తాము ప్రేమంతో పెంచుకున్న రామచిలుకను దొరికితే తెచ్చివ్వమని సదరు ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.