Noodles Making Video: ఈ వీడియో చూస్తే నూడుల్స్ ఇక జన్మలో తినరేమో !

Noodles Making Video: ఇంతకీ ఈ వీడియోను చూస్తేనే చాలు నూడుల్స్ లవర్స్ తమ అభిప్రాయం మార్చుకునేంతగా ఈ వీడియోలో ఏం ఉందా అని అనుమానం రావచ్చునేమో. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో ఏం ఉందో మీరే చూసేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 06:19 AM IST
Noodles Making Video: ఈ వీడియో చూస్తే నూడుల్స్ ఇక జన్మలో తినరేమో !

Noodles Making Video: ఇండియాలో జంక్ ఫుడ్‌కి అలవాటుపడిన వారికి అందరికీ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంత క్రేజో తెలిసిందే. అందులోనూ ఫాస్ట్ ఫుడ్ మెనూలో నూడుల్స్‌తో తయారయ్యే ఫుడ్ ఐటమ్సే ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకునే నూడుల్స్ విషయంలో కూడా కేవలం 2 నిమిషాల్లోనే బ్రేక్ ఫాస్ట్ రెడీ అంటూ చాలా బ్రాండ్స్ తమ నూడుల్స్‌ని ప్రమోట్ చేసుకోవడం చూసి వాటిని ఇష్టంగా చేసుకుని తింటుంటారు. చిన్ని పిల్లల నుంచి పెద్ద వారి వరకు కొంతమందికి ఈ నూడుల్స్‌తో చేసిన స్ట్రీట్ ఫుడ్ అంటే పడిచస్తుంటారు. కానీ ఇదిగో ఈ వీడియో చూస్తే వారు తమ అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉంది. 

ఇంతకీ ఈ వీడియోను చూస్తే జనం తమ అభిప్రాయం మార్చుకునేంతగా ఈ వీడియోలో ఏం ఉందా అని అనుమానం రావచ్చునేమో. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో ఏం ఉందో మీరే చూసేయండి. 

 

చూశారు కదా.. నూడుల్స్ ఎలా తయారవుతాయనేది ఈ వీడియోలో చూపించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి వీళ్లు నూడుల్స్ చేసే విధానం ఏ మాత్రం నచ్చే అవకాశం లేదు. అపరిశుభ్రమైన వాతావరణం, పరిసరాల మధ్య తినే వస్తువు కాకుండా అదేదో ముడిసరుకు తయారు చేసినట్టుగా ఉన్న విధానం కొంత జుగుస్పాకరంగా అనిపిస్తుంది కదూ. మనం అంత ఇష్టంగా లొట్టలేసుకుని మరీ తినే నూడుల్స్ ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా తయారు చేస్తారా అని అనిపించకమానదు.

ఈ వీడియో కూడా వీక్షించండి : OMG Scary Viral Video: చుట్టూ వందలకొద్ది మొసళ్లు.. మధ్యలో చిన్న బోటుపై దుస్సాహసం..

ఈ వీడియో కూడా వీక్షించండి : Tiger Drags Woman: యువతిని ఆటబొమ్మలా అడవిలోకి లాక్కెళ్లిన పులి.. షాకింగ్ వీడియో వైరల్

ఈ వీడియో కూడా వీక్షించండి : Tiger Viral Video: రోడ్డు దాటేందుకు తిప్పలు పడుతున్న టైగర్ వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News