Car Customers: నాగాలాండ్‌కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్‌జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్ క్రికెటర్
నాగాలాండ్‌లోని ఓ చెరువులో టెమ్‌జెన్ చిక్కుకున్నారు. ఆ బురదలో ఆయన బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అతడిని బయటకు తెచ్చేందుకు అతడి సహాయ సిబ్బంది కూడా సహకరించారు. ఒకరు వెనుక నుంచి నెట్టుతుండగా.. మరొకరు చేయి అందిస్తూ సహకారం అందించారు. చాలా సమయం తర్వాత ఆయన అతి కష్టంగా బురద నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చే ప్రయత్నంలో వారు మాట్లాడుకుంటున్న మాటలు వారినే కాదు నెటిజన్లను నవ్వించాయి.
Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క
దానికి సంబంధించిన వీడియోను టెమ్‌జెన్ షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈరోజు జేసీబీకే పరీక్ష. గమనికః కారును కొనుగోలు చేసే ముందు దాని ఎన్‌సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) రేటింగ్‌ను ఒకసారి తనిఖీ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం' అని పోస్టు చేశారు. టెమెజెన్ చేసిన వీడియోను లక్షలాది మంది చూశారు. తన శ్రమను ఒక సామాజిక సందేశం ఇచ్చేందుకు వినియోగించారు. కొత్త కారు కొనేప్పుడు ఎన్‌సీఏపీ రేటింగ్ అనేది చాలా ముఖ్యమని మంత్రి టెమ్‌జెన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రేటింగ్ బాగా లేని కారును కొనుగోలు చేస్తే బురదలో తాను పడిన కష్టం కారుతో మీరు ఎదుర్కొంటారని పరోక్షంగా చెప్పారు. ప్రజలు కారు కొనేముందు నాగాలాండ్ మంత్రి చెప్పిన సూచన పాటించండి. ఎన్‌సీఏపీ రేటింగ్ అనేది కారు కొనుగోలు అప్పుడు చాలా ముఖ్యమైన విషయం. రేటింగ్ తక్కువ ఉంటే కారు సక్రమంగా లేదని అర్థం. అలాంటి కారు కొంటే అవస్థలు పడుతారని మంత్రి టెమ్‌జెన్ చేస్తున్న సూచన.
Aaj JCB ka Test tha !
Note: It's all about NCAP Rating, Gadi Kharidney Se Pehley NCAP Rating Jarur Dekhe.
Kyunki Yeh Aapke Jaan Ka Mamla Hain !! pic.twitter.com/DydgI92we2
— Temjen Imna Along (@AlongImna) February 10, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook