ముచ్చట సంబరంలో.. బిడ్డకు పాలు పట్టకుండా ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి! నవ్వు ఆపుకోలేరు

Mother put milk feeder in babys ear insted of mouth. ఓ తల్లి, బిడ్డకు సంబందించిన ఫన్నీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చాలా సరదాగా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 20, 2022, 11:46 PM IST
  • గెలికితే ఊరుకుంటుందా మరి
    అందమైన యువతిని గుద్దిన గొర్రె
  • కారణం ఏంటో తెలుసా
ముచ్చట సంబరంలో.. బిడ్డకు పాలు పట్టకుండా ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి! నవ్వు ఆపుకోలేరు

Mother put milk feeder in babys ear insted of mouth: ప్రపంచాన్ని అరచేతిలో చూపించేదే సోషల్‌ మీడియా. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో మనుషులు, జంతులకు సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కొన్ని ఉహించని విధంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ తల్లి, బిడ్డకు సంబందించిన ఫన్నీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చాలా సరదాగా ఉంది. 

ఓ మహిళ తన బిడ్డతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ మహిళ స్నేహితులు కూడా ఆ రెస్టారెంట్‌లోనే ఉన్నారు. అందరూ కలవడంతో ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పాప ఓడవగానే.. డబ్బా పాలు పట్టిస్తుంది సదరు మహిళ. ఓవైపు పాలు పట్టిస్తూనే.. ఆ మహిళ తన స్నేహితులతో కబుర్లు చెబుతుంటుంది. అయితే కొంత సమయం తర్వాత ముచ్చట సంబరంలో పాప నోటికి బదులు చెవిలో పాల డబ్బా పెడుతుంది. కాసేపటికి చూసుకున్న ఆ తల్లి నవ్వులు పూయిస్తుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by punjabi industry (@punjabi_industry__)

ఈ ఫన్నీ వీడియోని punjabi_industry__ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ తల్లి, బిడ్డ వీడియోని చూసిన అందరూ నవ్వుకుంటున్నారు. ఇక ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'ముచ్చట సంబరంలో బిడ్డను మర్చిపోయిన తల్లి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బిడ్డకు పాలు పట్టకుండా ఏం చేస్తున్నావ్ తల్లి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 

Also Read: MS Dhoni: అభిమానులకు శుభవార్త.. మరో టీ20 లీగ్‌లోకి ఎంఎస్ ధోనీ!

Also Read: Kaleshwaram Pumps:నీటిలో మునిగిన కాళేశ్వరం పంపు రిపేర్లకు ఎంత ఖర్చో! సీనియర్ ఐఏఎస్ సంచలనం..   

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News