Belchers sea snake is Most dangerous venomous snake in the world: ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల జాతులకు చెందిన పాములు ఉన్నాయి. మనకు కేవలం నాగుపాము, కట్లపాము, కింగ్ కోబ్రా, అనకొండ, కొండచిలువ, ఆముల వాస్య, నల్లత్రాచు, శ్వేత నాగు, పింజర లాంటి పాములు మాత్రమే తెలుసు. కానీ తెలియని ఎన్నో రకాల పాములు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయి. కనీసం వాటి పేర్లు కూడా ఎప్పుడూ వినుండం. ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో అత్యంత విషపూరితమైన పాములు ఎక్కువగా ఉంటాయి.
బిల్చెర్స్ సీ స్నేక్, రాటిల్ స్నేక్, ఫిలిపిన్ కోబ్రా, బ్లాక్ మాంబా, డెత్ ఎడర్, ఇన్లాండ్ తైపాన్ లాంటి ఎన్నో రకాల అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. బిల్చెర్స్ సీ స్నేక్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. ఈ పాము విషం కొన్ని మిల్లీ గ్రాముల చుక్కలు మాత్రమే దాదాపుగా 1000 మంది మనుషులను చంపేస్తుంది. ఈ పాము సముద్రంలో ఉంటుంది. అందుకే బిల్చెర్స్ సీ స్నేక్ ప్రజలకు కనిపించదు.
ఇన్లాండ్ తైపాన్.. భూమిపై అత్యంత విషపూరితమైన పాము. ఇది ఒక కాటులో 100 మిల్లీ గ్రాముల విషాన్ని చిమ్ముతుంది. అంటే 100 మంది మనుషులను చంపడానికి ఈ విషం సరిపోతుంది. ఇది కాటేస్తే సెకండ్లలో మనిషి చనిపోతాడు. ఇన్లాండ్ తైపాన్ విషం నాగుపాము కంటే 50 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్, రాటిల్ స్నేక్ అత్యంత ప్రమాదకరమైన పాములలో ఉంటాయి. ఒక వ్యక్తి మరణించడానికి వీటి విషంలో ఒక పర్సంట్ చాలు.
డెత్ ఎడర్, సా స్కేల్డ్ వైపర్, ఫిలిపిన్ కోబ్రా, టైగర్ స్నేక్, బ్లాక్ మాంబా, తైపన్ కూడా అత్యంత ప్రమాదకరమైన పాములు. ఈ పాముల విషయం చాలా డేంజర్. ఒక మనిషిని చంపడానికి ఒక మిల్లీగ్రాము పాయిజన్ మాత్రమే సరిపోతుంది. ఇందులో కొన్ని ఒక కాటులో 200-400 మిల్లీ గ్రాముల విషాన్ని మనిషి శరీరంలోకి చిమ్మిస్తుంది. ఈ పాముల విషం మనిషి మెదడు, శ్వాస, గుండెపై నేరుగా ప్రభావితం చూపిస్తుంది. దాంతో మనిషి నిమిషాల్లో చనిపోతాడు.
టాప్ 10 జాబితా ఇదే:
1. బిల్చెర్స్ సీ స్నేక్
2. ఇన్లాండ్ తైపాన్
3. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్
4. రాటిల్ స్నేక్
5. డెత్ ఎడర్
6. సా స్కేల్డ్ వైపర్
7. ఫిలిపిన్ కోబ్రా
8. టైగర్ స్నేక్
9. బ్లాక్ మాంబా
10. తైపన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook