Single Lion Vs Group of Hyena's Viral Video: ఎంత బలమైన జీవి అయినా.. అంతకంటే బలమైన శత్రువుల చేతికి చిక్కితే అంతే సంగతి. అది అడవికి రాజు అయినటువంటి సింహాం అయినా సరే.. అందుకే అనువుగాని చోట అధికులం అనరాదు అని అంటారు పెద్దలు. అన్నట్టు మీరు లయన్ కింగ్ సినిమా చూశారు కదా.. ఆ సినిమాలో సింహాలకు, హైనాలకు మధ్య శత్రుత్వం, రెండు జాతుల మధ్య జాతి వైరం గురించి చూసే ఉంటారు. సింహాలు ఎంత బలమైన జీవులైనా.. అవి ఒంటరిగా ఉన్నప్పుడు నాలుగు హైనాలు చుట్టుముడితే అవి ప్రాణాలు దక్కించుకోవడం కోసం పెద్ద పోరాటమే చేయక తప్పదు. ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం కూడా అచ్చం అలాంటిదే.
బలహీనంగా ఉన్న లేడీ సింహం ఒకటి అనుకోకుండా రోడ్డుపైకి ఒంటరిగా వచ్చింది. అదే సమయంలో నాలుగు హైనాలకు ఆ సింహం కంటపడింది. సహజంగానే సింహాలకు, హైనాలకు మధ్య జాతి వైరం. అందులోనూ బలహీనంగా ఉన్న సింహాన్ని చూస్తే హైనాలకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా.. ఈ సీన్ లో హైనాల చేతికి చిక్కిన సింహం పరిస్థితి కూడా అలాంటిదే.
చూశారు కదా.. ఒంటరిగా చిక్కిన ఆడ సింహాన్ని నాలుగు హైనాలు చుట్టుముట్టి పీక్కు తినేందుకు సిద్ధం అన్నట్టు చూస్తున్నాయి. అప్పటికీ సింహం వెనుక భాగంలో నోట కరిచి చంపుకు తినేందుకు యత్నించాయి. కానీ సింహం చిన్నగానే ప్రతిఘటించి చిన్నచిన్నగా అడవిలోకి వెళ్లింది. సింహం పరిస్థితి చూస్తుంటే ఆ హైనాలతో తిరిగి పోరాడే పరిస్థితి అయితే లేదు కానీ ఎలాగోలా వాటి నుంచి తప్పించుకుని వెళ్లి సింహాల మందను కలిసే వరకు ప్రాణాలు దక్కించుకుంటే అంతే చాలు. కానీ ఆ హైనాలు కూడా ఆ సింహం వెనుకే అడవిలోకి పరుగెత్తడం చూస్తుంటే అది కష్టమే అని అనిపిస్తోంది. పాపం ఆ సింహం పరిస్థితి చూస్తోంటే ఆపదలో చిక్కుకున్నట్టే అనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Mother Buffalo Fights with Lions: 'తల్లిని మించిన యోధుడు' లేడు.. ఈ గూస్ బంప్స్ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు!
ఈ సీన్ చూసిన నెటిజెన్స్ నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సింహాలు కూడా అవి వేటాడి తినేటప్పుడు అవతలి జీవి గురించి ఆలోచించవు కదా.. దయా, జాలి లేకుండా వేటాడి చంపుకుని తింటాయి కదా.. మరి సింహాలకు అలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఎందుకు జాలి పడాలి అని కొందరు నెటిజెన్స్ అంటుంటే.. జీవి ఏదైనా జీవే కదా.. అది ఆపదలో చిక్కుకోవడం చూడలేకపోతున్నాం అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Python Swallows 300 Kgs Cow: గూస్ బంప్స్ వీడియో.. 300 కిలోల ఆవును మింగేసిన భారీ కొండచిలువ.. ఎగబడి చూస్తున్న జనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook