Man Kisses King Cobra: కింగ్ కోబ్రాకి ముద్దు.. ?? ఇలా చేయటానికే కాదు చూడటానికి కూడా ధైర్యం కావలి

Man Kisses Cobra: సోషల్ మీడియాలో పాములు, జంతుజీవాలకు చెందిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా వంటి పాముల వీడియోలకు క్రేజ్ ఇంకా ఎక్కువ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2022, 10:05 AM IST
Man Kisses King Cobra: కింగ్ కోబ్రాకి ముద్దు.. ?? ఇలా చేయటానికే కాదు చూడటానికి కూడా ధైర్యం కావలి

Man Kisses Cobra: ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా పాముల వీడియోలే ఉంటాయి. స్నేక్ క్యాచర్లు పాములతో చేసే విన్యాసాలు, పాములు తిరగబడటం ఇలా వివిధ రకాలైన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఉన్నది వైల్డ్‌లైఫ్ కన్జర్వేషనిస్ట్ వావా సురేశ్. మనిషనేవాడెవడూ చేయలేని సాహసం చేశాడు. అందుకే ఈ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పాము తలపై గప్‌చుప్‌గా, నిశ్శబ్దంగా ముద్దుపెట్టి సంచలనమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 16 వేలమందికి పైగా ఈ వీడియోను వీక్షించగా...1300 మంది లైక్స్ ఇచ్చారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saurabh Jadhav Jadhav (@10_viper_21)

పడగ విప్పి అటూ ఇటూ చూస్తున్న కింగ్ కోబ్రా ఇది. ముందు పాము వెనుక ఉండి చాలా సేపు పరిశీలిస్తాడు. ఏ మాత్రం అలికిడి లేకుండా, నెమ్మదిగా బాడీని మూవ్ చేస్తూ..పాము తలపై..మృదువగా ముద్దు పెడతాడు. ఈ క్రమంలో అతను చాలా అలర్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే ఏ మాత్రం అలికిడి అయినా పాము క్షణాల్లో ఎటాక్ చేయగలదు. నిజంగానే ఇది డేంజరస్, డేరింగ్ చర్య.

Also read: Dairy Milk Bajji: డైరీ మిల్క్ బజ్జీ ఎప్పుడైనా చూశారా? ఎలా తయారు చేయాలో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News