King Cobra Coiled Around Fan: పాములకు కొన్ని ప్రదేశాలు నచ్చుతాయి. వాటిలో ముఖ్యంగా పాత ఇళ్లు.. పాడబడ్డ భవనాలు.. నిర్మానుష్య ప్రాంతాలు.. కొంత తేమగా ఉండే ప్రదేశాలు పాములకు ఆవాసం ఉండేందుకు అనుకూలమైనవి. అందుకే గ్రామాల్లో ఉన్న పాత భవనాల్లో నిత్యం పాములు ప్రత్యక్షమవుతుంటాయి. మట్టి ఇళ్లు ఉంటే పాములకు అడ్డాగా మారుతాయి. అందుకే పల్లెటూర్లలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ విధంగా తాజాగా ఒక చోట పాత ఇంటిలో పాము దూరింది. ధూలం పైనుంచి ఫ్యాన్‌పైకి చేరింది. ఫ్యాన్ తిరుగుతుంటే దానితోపాటే పాము కూడా తిరుగుతుంది. దానికి సంబంధించి వీడియో ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కేరళలోని ఓ గ్రామంలోని ఓ మహిళ తన పాత ఇంట్లో నివసిస్తోంది. ఫ్యాన్‌కు వేసుకుని నిద్రిస్తుండగా ఉన్నపళంగా ఫ్యాన్‌పై తోక కనిపించింది. తోక వేలాడుతూ కనిపించగా ఆమె భయపడింది. తీక్షణంగా పరిశీలించగా పాము ఉండడాన్ని చూసి ఆమె బెంబేలెత్తింది. వెంటనే ఇంట్లో వారిని పిలిపించింది. వాళ్లు వచ్చి చూడగా పాము ఫ్యాన్‌పై కూర్చుని ఫ్యాన్ చుట్టూ తిరుగుతూ ఉంది. వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆపేశారు. ఫ్యాన్ ఆపివేయగా పాము పడగ విప్పింది.
ప్రజలంతా గుమికూడడంతో పాము మరింత అలర్టయ్యి బుసలు కొడుతూ ఉండిపోయింది. కొందరు వ్యక్తులు పామును బయటకు పంపించేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను చంద్రశేఖరన్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా పరిశీలించారు. వామ్మో ఎంత పెద్ద పాము అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన పామును అత్యంత విషపూరితమైనదని.. కాటు వేస్తే మనిషి ప్రాణం పోతుందనే వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.
Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్ చేసి పిలుపు
Also Read: Kumari Aunty Trending: కుమారి ఆంటీని బిగ్‌బాస్‌కు పంపాలి.. లేదంటే ఎమ్మెల్యేగా చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook