Hyderabad Metro Girl Dance: మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!

Beautiful Young Girl dance in Hyderabad Metro Rail. హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో డాన్స్ చేసిన యువతి క్షణాల్లో స్టార్ అయింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 20, 2022, 11:49 PM IST
  • మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌
  • నిమిషాల్లో వైరల్ అయిన వీడియో
  • కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు
Hyderabad Metro Girl Dance: మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!

Beautiful Young Girl dance in Hyderabad Metro Rail: సోషల్ మీడియా వచ్చాక యువత ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతుంది. యువతీయువకులు రీల్స్, ఫ్రాంక్స్, టిక్ టాక్ అంటూ నిత్యం వీడియోలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేమస్ అవుతున్నారు. కొందరు అయితే ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో డాన్స్ చేసిన యువతి కూడా క్షణాల్లో స్టార్ అయింది. ప్రస్తుతం ఆ యువతి డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌లో కాకుండా మెట్రో రైల్‌లో కూడా ఓ యువతి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. జీన్స్, స్లీవ్ లెస్ టాప్ ధ‌రించిన యువ‌తి.. కన్నడ సినిమా విక్రాంత్ రోనా సినిమాలోని 'రారా రక్కమ్మ.. రారా రక్కమ్మ' అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులు వేసింది. మ‌రో పాట‌కు క‌దులుతున్న రైల్లోనే స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి.

యువతి డ్యాన్స్‌ చేసిన వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే ఈ వీడియోలను కొందరు ఎంజాయ్ చేస్తుంటే. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు మెట్రో అధికారుల‌కు చేరాయి. అధికారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెట్టే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. యువ‌తిపై మెట్రో అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా..కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read: ఒత్తిడి లేకుండా ఆడండి.. సంబరాలు చేసుకుందాం! భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

Also Read: Virat Kohli: 20 నిమిషాల టైమ్ ఇస్తే.. విరాట్ కోహ్లీ సమస్య పరిష్కరిస్తా: గవాస్కర్

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News