Heavy floods in Vijayawada singh nagar: ఆంధ్ర ప్రదేశ్ లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలు కూడా వర్షాలకు అతలాకుతలం అయ్యాయి. అంతేకాకుండా.. వరదల వల్ల ఎక్కడ చూసిన రోడ్లన్ని బుదరమయంగా మారిపోయాయి. అనేక అపార్ట్ మెంట్లలో వదర నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయింది. సింగ్ నగర్ తో పాటు.. అనేక ప్రాంతాలలో ఇళ్లలోనికి భారీగా వరద నీళ్లు వచ్చి చేరాయి. అంతేకాకుండా.. కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి ఫుడ్ లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
హృదయ విదారక దృశ్యాలు
విజయవాడలో బురదలో ఆహార పొట్లాలు వేస్తున్న సిబ్బంది pic.twitter.com/ZdeKNfYIEq
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2024
ఈ నేపథ్యంలో.. ఏకంగా సీఎం చంద్రబాబు సైతం.. రంగంలోకి దిగి మరీ.. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అంతేకాకుండా.. మంత్రులు, అధికారుల్ని సైతం పరుగులు పెట్టించారు. ఇదిలా ఉండగా..పలు ప్రాంతాలలో బోట్ లు, జేసీబీలో సైతం చంద్రబాబు ప్రయాణించి అక్కడి వారిని పరామర్శిస్తు.. తానున్నానంటూ భరోసా కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో.. కేంద్రంతో మాట్లాడి కూడా.. ప్రత్యేకంగా బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం రంగంలోకి దింపారు. అంతేకాకుండా.. నిరంతం మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేకంగా..చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హెలికాప్టర్ లతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఫుడ్ ఫ్యాకెట్లను అందిస్తున్నారు . దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
విజయవాడలోసి సింగ్ నగర్ లో ఇప్పటికి కూడా వదర ప్రభావంలోనే ఉంది. అక్కడి ప్రజలు తినేందుకు ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రోడ్లన్ని ఎక్కడ చూసిన జలమయమైపోయాయి. అంతేకాకుండా.. అనేక ఇళ్లలొకి వదర నీరు చేరిపోవడం వల్ల.. కేవలం కట్టుబట్టలతో బైటకు వచ్చిన దయానీయకర పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. హెలికాప్టర్ లు, డ్రోన్ల సహాయంలో.. వెహికిల్స్ వెళ్లలేని ప్రదేశాలకు ఆహారం సరఫరా చేస్తున్నారు.
విజయవాడలోని ఒక ప్రదేశంలో.. హెలికాప్టర్ నుంచి ఆహారం పొట్లాలను విసురుతున్నారు. కిందంతా బురదగా ఉంది. ఫుడ్ ప్యాకెట్ల కోసం అక్కడి వాళ్లు గొడవ పడుతున్నారు. నాకంటే.. నాకు.. అని కొంత మంది ఫుడ్ ప్యాకెట్లు లాక్కొవడం కన్పిస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడలోని పరిస్థితిని ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.