Viral Video: ఇదేందయ్యో ఇది.. ఇలాంటి చేపను ఎక్కడా చూడలే! ఊసరవెల్లిలా రంగు మార్చుతోంది..

Squid Fish changing its colour in water. ఊసరవెల్లిలా రంగు మార్చే చేపకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 06:53 PM IST
  • ఇలాంటి చేపను ఎక్కడా చూడలే
  • ఊసరవెల్లిలా రంగు మార్చుతోంది
  • నాకు అలాంటిది కావాలి
Viral Video: ఇదేందయ్యో ఇది.. ఇలాంటి చేపను ఎక్కడా చూడలే! ఊసరవెల్లిలా రంగు మార్చుతోంది..

Google Trend Video, Squid Fish changing its colour from black to white in water: ఈ ప్రపంచం మొత్తం రహస్యాలతో నిండి ఉంది. భూమి నుంచి సముద్రం వరకు మిలియన్ల జీవులు రహస్యంగా జీవిస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని జీవులు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఓ జీవిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఊసరవెల్లిలా రంగు మార్చే చేపకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నిజామా కాదా అని ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే... 

ట్విట్టర్ ఖాతా 'ఫిగెన్'లో ఓ చేపకు సంబందించిన వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. నీటిలో అర చెయ్యి సైజులో ఓ స్క్విడ్‌ చేప ఈదుతోంది. ఓ వ్యక్తి దాన్ని రెండు అర చేతులతో నీటిలోంచి పైకి తీశాడు. వెంటనే అది తెల్లగా (పారదర్శకంగా) మారిపోయింది. ఇందులో మాయ ఏదీ లేదు అని చెప్పేందుకు.. ఆ వ్యక్తి చేపను మళ్లీ నీటిలో వదిలాడు. వెంటనే అది నల్లగా మారిపోయింది. మరోసారి బయటికి తీయగా.. తెల్లగా మారుతుంది. ఆపై నీటిలో వేయగా నల్లగా మారుతుంది. 

ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసి చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అదేంటి అలా మారుతోంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు విచిత్రంగా ఉంది అని ట్వీట్ చేస్తున్నారు. 'నాకు అలాంటిది కావాలి', 'భలే ఉందే ఈ చేప' అని కామెంట్ల వర్షం కురుస్తోంది. గ్లాస్ కారణంగానే అది నల్లగా మారుతుందని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. 

క్రాంచిడే జాతి చేప కుటుంబంలో దాదాపు 60 రకాల గ్లాస్ స్క్విడ్‌లు ఉన్నాయి. ఈ చేపల పొడవు 10 సెంటీమీటర్ల నుండి 3 మీటర్ల వరకు అంటాయి. ప్రతిఒక్కటి కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అందులో ఒకటే ఈ చేప అట. మనం నిత్యం చూసే చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ చేప రంగు మారడం నిజమేనా? లేదా గ్లాస్ కారణంగా మారుతుందా? తెలియాల్సి ఉంది. 

Also Read: Niharika Konidela: భర్తకు నిహారిక లిప్‌లాక్‌.. రెచ్చిపోయిన నెటిజన్లు!

Also Read: Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి ఆదిలాబాద్‌కి ఆయుధాల తరలింపు కేసులో లేటెస్ట్ అప్‌డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News