Qualcomm Engineer Earning More As a Cab Driver: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనగానే భారీ రెమ్యునరేషన్ ప్యాకేజెస్.. వారానికి రెండు సెలవులు, మూన్నెళ్లకోసారి ఇన్‌సెంటీవ్స్, మధ్యమధ్యలో అవీ ఇవీ పర్స్క్.. అవసరాలకు తగినన్ని పెయిడ్ లీవ్స్, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పెయిడ్ టూర్లూ షికార్లు.. ఇవీ చాలామంది ఊహించుకునేవి. కానీ మనుషులు అందరూ ఒకలా ఉండరన్నట్టు.. ఉద్యోగాలన్నీ ఒకలా ఉండవు. ఇదిగో శ్వేతా కుక్రెజా అనే ఓ మహిళ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ స్టోరీ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తను క్యాబ్‌లో ప్రయాణిస్తూ ఆ క్యాబ్ డ్రైవర్‌తో ముచ్చటించే క్రమంలో తెలిసింది ఏంటంటే.. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా బాగా చదువుకున్న ఇంజనీరే అని. అంతేకాదు.. అతడు అంతకంటే ముందుగా క్వాల్‌కామ్ ఇంజనీర్ కూడా.
ఔను.. క్వాల్‌కామ్ ఇంజనీర్‌గా పని చేస్తే వచ్చే జీతం తన అవసరాలకు సరిపోవడం లేదని భావించిన ఆ వ్యక్తి... ఎవ్వరూ తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంజనీరింగ్ డిగ్రీని పక్కనపెట్టి క్యాబ్ నడపాలి అనుకున్నాడు. అదే పని చేశాడు. తాను తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదన్నట్టు ఒకప్పటి ఇంజనీర్ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్‌గా వస్తున్న డబ్బుతోనే ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. పైగా తనకి తనే బాస్.. ఎవ్వడికీ సలాం కొట్టాల్సిన పని అసలే లేదు.
క్వాల్‌కామ్ సంస్థ గురించి..
క్వాల్‌కామ్ సంస్థ గురించి తెలిసిందే కదా.. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ తయారీకి అవసరం అయ్యే పరికరాలు, పరిజ్ఞానం గురించి తెలిసిన ఎవ్వరికైనా అందులో ఉపయోగించే క్వాల్‌కామ్ చిప్ టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది. అలాంటి సెమికండక్టర్, వైర్‌లెస్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ తయారీలో క్వాల్‌కామ్ అగ్రగామి. చాలా వరకు సెల్ ఫోన్ల తయారీలో ఈ సెమికండక్టర్స్ చిప్ ఉపయోగిస్తుంటారు. ఈ క్వాల్‌కామ్ ఒక అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ. అలాంటి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్.. ఆ ఉద్యోగంతో వచ్చిన డబ్బులు తన అవసరాలకు సరిపోవడం లేదని ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాడు.
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే తెలుసు కదా.. బతుకు దెరువు కోసం తప్పుడు పని చేయనంత వరకు ఏ పని చేసినా ఆ పనిని, ఆ పని చేసే వారిని గౌరవించాలి. ఏ విధంగానూ లేదా ఏ కారణం వల్ల కూడా ఒక పని తక్కువ , మరొక పని తక్కువ అని తక్కువ చేసి మాట్లాడకూడదు అనేదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటకు అర్థం. అన్ని పనులు, అన్ని వృత్తులు సమానమైన గౌరవం పొందాలి అనే సమాజహితంలోంచి పుట్టిందే ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు ఈ సాప్ట్‌వేర్ ఇంజనీర్ చేస్తోంది కూడా అలాంటిదే. తన ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి బతుకు దెరువు కోసం ఏ పని అయితే ఏంటని క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాడు.
ఇది కూడా చదవండి : Interesting Facts About CIBIL: ఏయే సందర్భాల్లో సిబిల్ స్కోర్ పడిపోతుందో తెలుసా ?
శ్వేత పోస్ట్ చేసిన స్టోరీ చూశాకా నెటిజెన్స్ చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఒక నెటిజెన్ స్పందిస్తూ.. " తన ఇంటి దగ్గర్లో ఒక పాని పూరి అమ్ముకునే వ్యక్తి ఉన్నాడని.. అతడు చదివింది ఆరో తరగతే కానీ అతడు నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల వరు సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. ఇటీవలే మరొక చోట మరో స్టాల్ కూడా తెరిచి తన బిజినెస్‌ని విస్తరించుకుంటున్నాడు " అని కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి : Elon Musk House: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి