Flying Saucer Viral Video: చైనాలో కనిపించిన ఫ్లయింగ్ సాసర్.. ఏలియెన్స్ చైనాకు వచ్చారా ?

Flying Saucer In China: గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉంటే ఎక్కడుంటారు ? ఎలా ఉంటారు ? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే వాళ్లు మన భూగ్రహాన్ని తరచుగా సందర్శిస్తున్నారా ? అప్పుడప్పుడు మానవులకు ఎంతో అరుదుగా కనిపించినట్టుగా చెబుతున్న అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్ గ్రహాంతర వాసులవేనా ?

Written by - Pavan | Last Updated : Jun 14, 2023, 03:40 AM IST
Flying Saucer Viral Video: చైనాలో కనిపించిన ఫ్లయింగ్ సాసర్.. ఏలియెన్స్ చైనాకు వచ్చారా ?

Flying Saucer In China: గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉంటే ఎక్కడుంటారు ? ఎలా ఉంటారు ? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే వాళ్లు మన భూగ్రహాన్ని తరచుగా సందర్శిస్తున్నారా ? అప్పుడప్పుడు మానవులకు ఎంతో అరుదుగా కనిపించినట్టుగా చెబుతున్న అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్ గ్రహాంతర వాసులవేనా ? ఇలా ఎన్నో సందేహాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, తాజాగా చైనాలో మానవ నిర్మితమైన ఫ్లయింగ్ సాసర్ దర్శనం ఇచ్చింది. చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఈ ప్లయింగ్ సాసర్ టెస్ట్ రన్ చేశారు. ఈ ఫ్లయింగ్ సాసర్‌ను షెన్‌జెన్ యుఎఫ్‌ఓ టెక్నాలజీ సంస్థ నిర్మించిందని చెప్పారు. మధ్యలో ఒక పైలట్ కూర్చోగా.. అతడి చుట్టూ 12 ప్రొపెల్లర్లు ఉన్నట్టు వీడియో చూస్తే అర్థం అవుతోంది.

పైలట్‌కు 360 డిగ్రీల వ్యూ కనిపించడంతో పాటు 650 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు ఎగిరేలా ఈ ఫ్లయింగ్ సాసర్ ని తయారు చేశారు. ఫ్లయింగ్ సాసర్ ని పోలి ఉన్న ఈ వాహనాన్ని తయారు చేయడానికి మొత్తం 3 సంవత్సరాలు పట్టిందని.. జూన్ 3న మొదటిసారిగా అందరి సమక్షంలో దీనిని టెస్ట్ రన్ చేయడం జరిగింది అని నిర్వాహకులు తెలిపారు.

 

ఇంతకీ ఈ ఫ్లయింగ్ సాసర్ ఎందుకోసం తయారు చేశారు ? ఎవ్వరు, ఎక్కడికి వెళ్లేందుకు తయారు చేశారు అనే సందేహం రావొచ్చేమో.. అక్కడికే వస్తున్నాం... ఈ ఫ్లయింగ్ సాసర్ ని పర్యాటకులను ఆకర్షించడం కోసం రూపొందించారు. పర్యాటకులకు అచ్చం గ్రహాంతరవాసులు ఉపయోగించే ఫ్లయింగ్ సాసర్ ని చూస్తున్నామా అనే ఫీల్ కలిగించేలా మేకర్స్ దీనిని రూపొందించడం విశేషం. సీఎన్ఎన్ న్యూస్ 18 ఈ వీడియోను షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Trending News