నేచర్ మనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇంద్రధనుస్సు అద్భుతం.. పూవుల్లో దాగున్న పండ్లు అద్భతం, ఆ సీతాకోక చిలుక రంగులు అద్భుతం..ఇలాంటి అద్భుతమైన నదిని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. దాని అద్భుతమైన విషయాలు మీతో షేర్ చేయబోతున్నాం.
5 రంగులు అద్భుతమైన నది
నార్మల్ గా అయితే నది నీరు నీలం లేదా తెలుపు రంగులో ఉంటుంది. దానిపై సూర్యుడి వెలుగు పడితే దాని రంగులు కాస్త వేరుగా కనిపిస్తాయి. చీకటిలో నది చీకటిగా కనిపిస్తుంది. మురికి ఉంటే నది రంగు నల్లగా మారుతుంది. సౌత్ అమెరికా ( South America ) మహాద్వీపంలోని కోలంబియా ( Columbia ) లో ఉన్న ఒక నదిలో మీరు ఐదు రంగులను చూడవచ్చు. దాంతో దాన్ని చూడటానికి చాలా దూరం నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. ఈ నది పేరు కాన్యో క్రిస్టేల్స్ ( Crano Cristales ). దీని పేరు స్పానిష్ ( Spanish) పదంపై వచ్చింది. ఇంగ్లిష్ లో దీనిని క్రిస్టల్ ఛానెల్ ( Crystal Channel ) అంటారు.
#CañoCristales el río que escapó del paraíso y está en el #DepartamentodelMeta #Colombia#ColombiaMagnífica
Grcs a @colombia_hist
Video de @danichu07@Colombia@PaisajeCol@ParquesColombia
pic.twitter.com/3ELDLABrmD@JuanLozano_R@jafalconblasco
— Constantino Portilla (@cjportillaj) August 30, 2020
ఈ నదీ నీరు సంవత్సరం మొత్తం సాధారణంగా ఉంటుంది. కానీ సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో ఇది హఠాత్తుగా రంగులు మార్చుతుంది. ఆ సమయంలో దీన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. చాలా మంది ఈ నదిని చూసి ఇంద్రధనస్సు నీటిలో కరిగిపోయిందేమో అంటారు. చిత్రకారులు అక్క డికి వచ్చి పెయింటింగ్ కూడా వేస్తుంటారు.
రంగులు మారడానికి కారణం ఏంటంటే..
ఈ ప్రాంతంలో వర్షం కురవని సమయంలో కొన్ని నెలల పాటు నదిలో ఉన్న అరుదైన మొక్క మెకరైనా క్వావిగెరా (Macarina Clavigera) ఎరుపు రంగులోకి మారిపోతుంది. అది మొల్లిమెల్లిగా ఇతర రంగుల్లోకి మారిపోతుంది. అంటే పసుపు రంగులో, నీలం, నారింజ లేదా ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఈ ఐదు రంగుల కలయికతో ఈ నది అద్భుతంగా మారిపోతుంది.
ఈ నదిపై సూర్యుడి కిరణాలు పడితే నది మరింత అందంగా మారుతుంది. నదిలోని అద్భుతమైన రంగులు పైకి ఉబికి వస్తుంది. ఒకానొక సమయంలో నదిలో నీరు ఎంతగా తగ్గిపోతుంది అంటే రంగులు మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభం అవుతోంది.
తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR
Nature Wonders: 5 Colors లో ప్రవాహించే నీటి ధార.. నేచురల్ వండర్