Chinese Woman Trying To Kill Pregnant Colleague: మనలో చాలా మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలతో ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని ప్రదేశాలలో కంపెనీలలో మాన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని చోట్ల మాన్ పవర్ తక్కువగాను ఉంటుంది.కొన్ని కంపెనీలలో విపరీతమైన చాకిరీ ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనులను కూడా ఒక్కొరితోనే చేయిస్తుంటారు. ఎక్కువ మంది ఎంప్లాయిస్ ఉంటే వారికి జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది కంపెనీల మీద భారం కాకూడదని చాలా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవు. ఈ క్రమంలో ఉన్న వారి మీద పనిభారంఎక్కువగా పడుతుంటుంది. కొందరు వర్క్ విషయంలో.. చాలా నిబద్ధతతో ఉంటారు. ముఖ్యంగా కొన్ని పనిప్రదేశాలలో పనిచేసే వాళ్లు కష్టపడుతునే ఉంటారు.
మరికొందరు మాత్రం పనిచేస్తున్నట్లు నటిస్తుంటారు. నిజానికి వీరిలాంటి వాళ్లే కష్టపడిపని చేసే వారు ఇబ్బందులకు గురౌతుంటారు. వీరు తమ పని సక్రమంగా చేయకుండా, చేసినట్లు నటిస్తుంటారు. దీంతో పనిప్రదేశంలో వర్క్ విషయంలో తీవ్రఒత్తిడి ఏర్పడుతుంది. మరోవైపు ఆఫీసు బాస్ పని సరైన టైమ్ కు అవ్వకపోతే.. ఇబ్బందులు పెడుతుంటారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడిలో కొందరు తమ సహోద్యోగి లీవ్ పెడితే తమపై పనిభావం ఉంటుందని భయపడతుంటారు. కొందరు చిటీకీ మాటికి లీవ్ లు పెడుతుంటారు. మరికొందరు ఎవరైనలీవ్ లు తీసుకుంటే, అస్సలు భరించలేరు. ఈ క్రమంలో ఒక మహిళ.. తన సహోద్యోగి మెటర్నీటీ లీవ్స్ కు అప్లై చేసిన సంగతి తెలుసుకుని చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
చైనాలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆడదానికి ఆడదే ఎనిమీ అనిదానికి పక్కాగా సూట్ అయ్యే విధంగా జరిగిన ఈ దారుణ వ్యవహరం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాకు చెందిన ఒక మహిళ ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. ప్రభుత్వ నియామాల ప్రకారం.. ఆమెకు ఆరునెలలపాటు ప్రసూతీ సెలవులతోపాటు, వేతనం కూడా ఇస్తారు. అయితే.. ఈ విషయాన్ని ఆమె సహోద్యోగి తెలుసుకుంది. ఆమె వెళ్లిపోతే తన మీద పనిభారం పడుతుందని కన్నింగ్ ప్లాన్ వేసింది. ఒకరోజు ఆమె డెస్క్ దగ్గరకు చేరుకుని తాగే నీటి బాటిల్ లో విషం కల్పింది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాసేపటికి అక్కడికి వచ్చిన ప్రెగ్నెంట్ మహిళ నీళ్లు తాగాలని చూసింది. కానీ బాటిల్ నుంచి ఏదో దుర్వాసన వచ్చింది. తొలుత వాటర్ సప్లయింగ్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంది. కానీ ఎందుకో అనుమానం వచ్చి, సీసీ కెమెరాలను పరిశీలించింది. అప్పుడు ఆమె గుండె ఆగినంతపనైంది. ఆమె సహోద్యోగి బాటిల్ లో ఏదో రసాయనం వేయడం అందులో రికార్డు అయ్యింది. వెంటనే ఆమె కంపెనీ బాస్ కు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిలేడీని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరపగా.. తనమీద పనిభారం ఎక్కువౌతుందని ఇలా చేశానని ఒప్పుకుంది. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర సంచనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook