ఫిల్మ్‌ఫేర్ ప్రకటించిన సినిమా అవార్డుల్లో నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రముఖ మ్యాగజైన్ ‘ఫెమినా’ తన ట్విటర్లో పేర్కొంటూ, ఇర్ఫాన్ ఖాన్‌కి బదులు ఇర్ఫాన్ పఠాన్ అని టైప్ చేయడంతో ఆ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదే విషయంపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘థాంక్స్. నేను పురస్కారం అందుకోవడానికి రాలేను. నా అవార్డును నా ఇంటికే పంపండి’ అని ట్వీట్ చేశాడు. పఠాన్ ట్వీట్‌కు నెటిజన్ల నుండి బాగానే స్పందన వచ్చింది. ఆయన చేసిన ట్వీట్ చాలా కామెడీ ఉందని.. ఇర్ఫాన్ సినిమాల్లో ట్రై చేయవచ్చని చాలా మంది ట్వీట్ చేశారు. 33 సంవత్సరాల ఇర్ఫాన్ పఠాన్ చాలా రోజుల నుండి భారత జట్టుకి ఆడడం లేదు. ఇర్ఫాన్ సోదరుడు యూసుఫ్ పఠాన్ కూడా భారత జట్టుకి ఆడిన విషయం మనకు తెలిసిందే.
It was definitely well deserved, @IrfanPathan https://t.co/QKwDWzJ7Bs
— Femina (@FeminaIndia) January 21, 2018
Thank u n sorry I couldn’t make it but u can send the award to me at my home ;);)
— Irfan Pathan (@IrfanPathan) January 21, 2018