Bengaluru School Girls Fight: వాళ్లంతా స్కూల్ విద్యార్థినులు... ఏమైందో ఏమో తెలియదు కానీ స్కూల్ ముందు రచ్చ రచ్చ చేశారు.. ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరినొకరు జుట్టు పట్టి కొట్టుకున్నారు... పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు... మెట్ల పైనుంచి తోసేసుకున్నారు... కొందరైతే ఏకంగా బేస్ బాల్ బ్యాట్‌తో దాడికి దిగారు... అంతా అరుపులు, కేకలు... రోడ్డుపై వెళ్తున్నవారికి అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట చోటు చేసుకున్న సీన్ ఇది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
స్కూల్ నుంచి బయటకొచ్చిన ఆ విద్యార్థినులు అంతలా ఎందుకు ఒకరినొకరు కొట్టుకున్నారో అర్థం కావట్లేదు. అందులో చాలావరకు విద్యార్థినులు స్కూల్ యూనిఫామ్‌లో ఉండగా... కొందరు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. ఉరుము ఉరిమి మీద పడినట్లు... జరగరాని ఘోరమేదో జరిగిపోయినట్లు... ఒకరిపై ఒకరు కసితీరా దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు అబ్బాయిలు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
ఆ స్కూల్ విద్యార్థినుల్లోని రెండు గ్రూపుల మధ్య ఈ ఫైట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు కొట్టుకున్నారనేది తెలియలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి... అక్కడేం జరుగుతుందో చెప్పగలరా అంటూ చాలామంది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు కొందరు నెటిజన్లు చెబుతున్నారు. గతంలో ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక పేరెంట్‌పై చేయి చేసుకున్నారని... ప్రిన్సిపాల్ అలా ఉంటే ఇక స్టూడెంట్స్ ఇలా ఉండకపోతే ఎలా ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
https://t.co/ai3hVktPsk
There principal is like that so what can be expected from student.— . (@bsmaya69) May 18, 2022
Also Read: F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!
Also Read: Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook