cobra snake video goes viral: సాధారణంగా పాములు చలికాలంలో ఎక్కువగా బైట ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. అవి వెచ్చగా ఉన్న ప్లేస్ లోకి వెళ్లి దాక్కుంటాయి. బట్టలు, బూట్లు, సజ్జలు, షెల్ఫ్ లలో పాములు నక్కి దాక్కుంటాయి. కొన్నిసార్లు పరుపులు, దిండులలో కూడా పాములు కన్పిస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలో వాటి దగ్గరకు వెళ్లిన వారిని పాములు కాటేస్తుంటాయి.
పాముల వీడియోలు ఈ మధ్య కాలంలో యమక్రేజ్ గా మారాయని చెప్పుకొవచ్చు. పాముల కాటుకు చెందిన ఘటనలు కూడా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక పాము హెల్మెట్ లో దూరి స్కూటీ రైడర్ ప్రాణాలు తీసేంత పనిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
यह दक्षिण भारत का वीडियो है एक कोबरा का बच्चा हेलमेट में छुपा हुआ था और व्यक्ति के सर में काट लिया !!
जब भी आप हेलमेट पहने तो एक बार हेलमेट को ठोक कर झाड़ कर ही पहने !!#ViralVideos #Helmet #Viral pic.twitter.com/8PnRKdMXjo— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 24, 2024
పూర్తి వివరాలు..
రోజులాగే.. సదరు స్కూటీ రైడర్ తన హెల్మెట్ ను పెట్టుకుని రోడ్డుమీద వెళ్తున్నాడు. ఇంతలో ఏమైందో కానీ.. హెల్మెట్ నుంచి ఏదో తనకు కుట్టినట్లు అన్పించింది. వెంటనే స్కూటీని ఆపేసి.. అందులో ఏముందో చూశాడు. చిన్న పాము కన్పించింది. వెంటనే అక్కడున్న వారికి చెప్పగా.. అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అప్పటికే అతను మూర్ఛపోయినట్లు తెలుస్తొంది.
మరొవైపు స్నేక్ క్యాచర్ అక్కడకి చేరుకుని హెల్మెట్ లో నక్కిన కోబ్రా పిల్లను జాగ్రత్తగా బైటకు తీశాడు. అది బుసలు కొడుతూ.. రచ్చ చేసింది. పామును జాగ్రత్తగా స్నేక్ క్యాచర్ బంధించినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. అందుకే.. చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. హెల్మెట్ ను చాలా మంది బైక్ లకు పెట్టేసి వెళ్లిపోతుంటారు. అదే విధంగా బైట, అటక మీద ఎక్కడో హెల్మెట్ ను పెడుతుంటారు. దీని వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెప్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter