Kukri Snake Common Krait Snake Fight: చిన్న చేపను పెద్ద చేప మింగుతుందని అందరికీ తెలిసిందే. కానీ చిన్న పామును పెద్ద పాము మింగడం చాలా అరుదు. అలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో చోటుచేసుకుంది. ఓ గోదాములోకి దూరిన రెండు పాములు కొద్దిసేపు కొట్లాడుకున్నాయి. చివరకు చిన్న పాము పోరాడలేక నీరసపడిపోగా వెంటనే పెద్ద పాము దానిని తినేసింది. పాప్ కార్న్‌లా నమిలినట్టు మింగేసింది. ఆ దృశ్యాలు చూసినవారందరి ఒళ్లు గగుర్పొడిచాయి. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Also Read: Taj Mahal: మొన్న నీరు లీకేజీ, నేడు పిచ్చిమొక్కలు.. ప్రమాదపుటంచున తాజ్ మహల్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం రాత్రి రెండు పాములు హల్‌చల్ చేశాయి. పట్టణంలోని ఓ ఎరువుల గోదాములో కట్లపాము, కుక్రి పాము కనిపించాయి. అందులో పని చేసే కూలీలు, ఉద్యోగులు పాములను చూసి భయాందోళన చెందారు. ఏం చేయాలో తెలియక వెంటనే ఇతరులకు సమాచారం ఇచ్చారు. గోదాము నిర్వాహకులు వచ్చి చూశారు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించారు. అయితే రాత్రి కావడంతో వారు వచ్చేవరకు ఆలస్యమైంది.
Also Read: Viral Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. గణపయ్య మెడలో చేరిన నాగు పాము.. వీడియో వైరల్..
పాములు పట్టేవారు ఆలస్యమవగా.. ఈలోపు కుక్రి పాము.. కట్ల పాము గొడవ పడ్డాయి. పరస్పరం పోట్లాడుకున్నట్లు వాటికి అయిన గాయాలను చూస్తే తెలుస్తోంది. కాగా కట్ల పాము ఐదడుగుల పొడవు ఉండి ధృడంగా ఉంది. కుక్రి పాము చిన్నపిల్లలాగా కనిపిస్తోంది. మూడడుగుల పొడవు సన్నగా ఉంది. దీంతో తన కన్నా పెద్ద అయిన కట్ల పాముతో కుక్రి పాము పోట్లాడడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది.
గొడవపడలేక నిస్సహాయక స్థితికి చేరుకున్న కుక్రి పామును పెద్ద కట్ల పాము తినేసింది. కుక్రి పామును తినేందుకు కట్ల పాము చాలా కష్టపడింది. పొర్లాడుతూ.. అటు ఇటు తిరుగుతూ కుక్రిని మింగేందుకు శ్రమించి కొన్ని నిమిషాల తర్వాత మొత్తం తినేసింది. ఈ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఆలస్యంగా చేరుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని కట్ల పామును బంధించారు. అనంతరం అటవీ ప్రదేశంలో వదిలేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా కుక్రి పాముతోపాటు కట్ల పాము కూడా చాలా విషపూరితమైనది. వాటిని పట్టుకుని అడవిలోకి వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.