Liquor shops: మందుబాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే..?

Wine shops closed: హైదరబాద్ లో నిమజ్జన వేళ పోలీసులు ఇప్పటి నుంచి గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేయాలని కూడా  అధికారులు ఆదేశించారు.
 

1 /6

తెలంగాణలో గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఊరు, వాడ, పల్లె, పట్నం తేడా లేకుండా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరబాద్ లో పోలీసులు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

2 /6

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొంత మంది పొకిరీలు మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. 

3 /6

గతంలో వినాయకచవితి ఉత్సవాల సమయంలో కొంత మంది ఆగంతకులు.. అమ్మాయిల్ని వేధించిన ఘటన కూడా వార్తలలో నిలిచింది. దీంతో పోలీసులు మరోసారి మద్యంతాగి గొడవలు చేయకుండా కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు.  

4 /6

ముఖ్యంగా.. హైదరబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో.. సెప్టెంబర్ 17 ఉదయం 6  నుంచి,  సెప్టెంబర్ 18 సాయంత్రం 6 వరకు మద్యం షాపులు బంద్ ఉంచాలని కూడా హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

5 /6

పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎక్కడైన అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. మరోవైపు ఆబ్కారీ అధికారులు సైతం.. మద్యం దుకాణాలు క్లోజ్ చేసి ఉంచాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

6 /6

దేశంలో చాలా వరకు జరుగుతున్న క్రైమ్ లలో మద్యం మత్తులో.. ఉన్న వాళ్లు చేస్తున్నట్లు కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ముఖ్యమైన కొన్నిరోజుల్లో , శాంతి భద్రతలు తలెత్తినప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా మద్యం షాపులను బంద్ ఉంచాలని ఆదేశిస్తుంటారు.