Cholesterol: ఈ 5 కూరగాయలు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి.. ఈరోజే మీ డైట్లో చేర్చుకోండి..

Cholesterol Lowering Vegetables: కొలెస్ట్రాల్‌లో మంచివి ఉంటాయి.. చెడ్డవి ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతుంది.

Cholesterol Lowering Vegetables: కొలెస్ట్రాల్‌లో మంచివి ఉంటాయి.. చెడ్డవి ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతుంది. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కార్డియోవాస్క్యూలర్ డిసీజ్ ఇది హార్ట్‌ అటాక్, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.
 

1 /6

కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నవారు ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అనుసరించాలి.  అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటారు. లైఫ్ స్టైల్ మనం మార్చుకునే విధానం ఆధారంగా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం బరువు తగ్గడానికి అయినా, గుండె ఆరోగ్యానికి అయినా లైఫ్‌స్టైల్లో ముందుగా మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  

2 /6

కొన్ని నివేదికల ప్రకారం బెండకాయను మన డైట్లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బెండకాయ జిగురులో ముసిలేజ్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. బెండకాయలో మెగ్నిషీయం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, కే, ఏ పుష్కలంగా ఉంటుంది.  

3 /6

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం వంకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ బీ6 ఉంటుంది.  

4 /6

కాలెలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి ఇది కొలెస్ట్రాలో స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఏ, సీ, కే, కాల్షియం, ఐరన్, జింక్, డైటరీ ఫైబర్ ఉంటుంది.  

5 /6

హార్వార్డ్ యూనివర్శిటీ ప్రకారం బీన్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఇవి జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచివి. గుండె సమస్యలను తగ్గిస్తాయి.  

6 /6

హర్వార్డ్‌ హెల్త్ ప్రకారం బీన్స్ లో కూడా కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )