GHMC upto ORR: ఔటర్ వరకు విస్తరించనున్న గ్రేటర్ హైదరాబాద్, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం కొత్త మ్యాప్ ఇలా

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖల్ని మరోసార మార్చేందుకు సిద్ధమౌతోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెమో ప్రభుత్వం ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరగనుంది. మరి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

GHMC upto ORR: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖల్ని మరోసార మార్చేందుకు సిద్ధమౌతోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెమో ప్రభుత్వం ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరగనుంది. మరి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

1 /8

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక గత మూడు నెలలుగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే పనిలో ఉంది. ఇప్పుడిక ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. 

2 /8

3 /8

తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రణాళిక ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇప్పుడిక మొత్తం  16 మున్సిపాలిటీలు ఉంటాయి. అందులో పెద అంబర్ పేట్, శంషాభాద్, తుర్కయాంజల్, నార్శింగి, మణికొండ, ఆదిభట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్, దమ్మయి గూడ, నగరం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, టుంకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం ఉన్నాయి. 

4 /8

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, గండిపేట్, బాలాపూర్, హయాత్ నగర్, అబ్లుల్లాపూర్ మెట్, ఇబ్రహీం పట్నం, మహేశ్వరంలోని అత్యధిక ప్రాంతాలు జీహెచ్ఎంసీ ప్రాంతం చుట్టూ ఉంటాయి. దాంతో అవసరం వచ్చినప్పుడు ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. అందుకే ప్రభుత్వం వీటన్నింటినీ జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకురానుంది.

5 /8

6 /8

ఇక మున్సిపాలిటీల విషయానికొస్తే కొత్తగా 8 మున్సిపాలిటీలు విలీనం కావచ్చు. ఇందులో ఆదిభట్ల, జల్ పల్లి, మణికొండ, నార్శింగ్, పెద్ద అంబర్ పేట్, శంషాబాద్, తుర్కయాంజల్, తుక్కుగూడలు ఉన్నాయి. ఆమనగల్లు, ఇబ్రహీం పట్నం, శంకర్ పల్లి, షాద్ నగర్ మున్సిపాలిటీలు ఔటర్ రింగ్ రోడ్డు పరిధికి బయట ఉండటంతో అవి విలీనం కావు

7 /8

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ ప్రకారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మూడు కార్పొరేషన్లు బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్ విలీనం కానున్నాయి. ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లు విలీనం కానున్నాయి. 

8 /8

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసే బిల్లును ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమౌతోంది.