Bhagyashri Borse: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ కోవలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మరో అందమైన భామ ‘భాగ్యశ్రీ బోర్సే’. త్వరలో ఈమె హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
భాగ్యశ్రీ బోర్సే ది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ ఈమె స్వస్థలం. నటి కాకముందు పలు మోడల్ గా పలు కంపెనీలకు పని చేసింది.
నటిగా ఫస్ట్ మూవీనే రవితేజ వంటి సీనియర్ హీరో సరసన లభించడం మాములు విషయం కాదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతేకాదు ఇందులో రవితేజతో భాగ్యశ్రీ బోర్సే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా హాట్ టాపిక్ గా మారింది. మాస్ మహారాజ్ కూడా ఈ సినిమాలోని పాటల్లో భాగ్యశ్రీని టచ్ చేయకూడని అందాలను సైతం టచ్ చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. ముదురు హీరోకు ఈ వయసులో ఇవన్ని అవసరమా అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి.
అంతేకాదు ఈ మధ్యకాలంలో ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం షరా మాములే. కానీ ఈమె పట్టుబట్టి.. తెలుగు నేర్చుకొని.. ఫస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని సంచలనం రేపింది.
బహుశా తెలుగులో విజయశాంతి సహా ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఏ బడా హీరోయిన్స్ ఎవరు కూడా ఇలా ఫస్ట్ సినిమాతోనే తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు.
మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. 1980ల కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
స్వతహాగా అమితాబ్ అభిమాని అయిన రవితేజ..‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ అభిమాని పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.
మిస్టర్ బచ్చన్ మూవీ ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ల ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదల కాబోతుంది.దాంతో పాటు ‘తంగలాన్’, ‘ఆయ్’ సినిమాలు పోటీలో ఉన్నాయి.