Super star Krishna Birth Anniversary: తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. ఎడిటర్‌గా.. స్టూడియో అధినేతగా.. డిస్ట్రిబ్యూటర్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రికి కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన ఘనుడు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సినిమా కెరీర్‌లో టాప్ సినిమాల విషయానికొస్తే..
తెలుగు తెరకు కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అంతేకాదు ఎన్నో కొత్త టెక్నాలజీలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది.
1976లో కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భలే దొంగలు' మూవీ తెలుగులో ఫస్ట్ తొలి ఫూజీ కలర్ మూవీ.
కొల్లేటి కాపురం 1976లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఫస్ట్ తొలి RO మూవీగా రికార్డులకు ఎక్కింది. తొలి ORW కలర్ మూవీ... 1972లో తెరకెక్కిన 'గూడుపుఠానీ' మూవీ తొలి ORW కలర్ మూవీ కూడా సూపర్ స్టార్ కృష్ణ చిత్రం కావడం విశేషం.
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పీక్స్‌లో ఉన్న సమయంలో ఎలాంటి డ్యూయట్ హీరోయిన్ లేకుండా నటించిన సినిమా 'ఈనాడు'. 1982లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
తెలుగులో సూపర్ కృష్ణ హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా సింహాసనం. తెలుగులో ఫస్ట్ 70 MM మూవీ. అంతేకాదు ఫస్ట్ 6 ట్రాక్ స్టీరియో సిస్టమ్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కించారు.
తెలుగులో ఫస్ట్ డీటీఎస్ (DTS) మూవీ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'తెలుగు వీర లేవరా'. ఈ సినిమా 1995లో విడుదలైన ఈ సినిమాను ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
తెలుగులో ఒకే కాలండర్ ఇయర్‌లో అత్యధిక సినిమాలు విడుదల చేసిన కథానాయకుడిగా కృష్ణ రికార్డులు క్రియేట్ చేసారు. 1972లో 18 సినిమాల్లో హీరోగా నటించారు. 1971లో 11, 1970లో 16 సినిమాలు విడుదలయ్యాయి.