Super Star Krishna Birth Anniversary: సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రేర్ రికార్డ్స్.. పార్ట్ -1

Super Star Krishna Birth Anniversary: సూపర్ స్టార్ కృష్ణ తన 5 దశాబ్దాల నట జీవితంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త టెక్నాలజీలు పరిచయం చేసారు. అంతేకాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడంలో సూపర్ స్టార్ కృష్ణ చేసి కృషి ఎనలేనిది. ఆయన ఏయే కొత్త టెక్నాలజీలను తెలుగు తెరకు పరిచయం చేసారో ఓ లుక్కేద్దాం..

1 /6

  పద్మాలయా స్టూడియో పతాకంపై సూపర్ స్టార్ కృష్ణ నిర్మాణంలో వి.రామచంద్రరావు, కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లూరి సీతారామరాజు' తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

2 /6

1972లో తెరకెక్కిన 'గూడుపుఠానీ' మూవీ తొలి ORW కలర్ మూవీ కూడా సూపర్ స్టార్ కృష్ణ చిత్రం కావడం విశేషం.

3 /6

  మోసగాళ్లకు మోసగాడు.. 1971లో పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో తొలి కౌబాయ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

4 /6

తెలుగులో తొలి స్కోప్ టెక్నోవిజన్ టెక్నాలజీలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం 'సాక్షి'.  1967లో విడుదలైన ఈ ఈ మూవీ విజయం సాధించింది.

5 /6

గూఢచారి 116.. తెలుగులోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి జేమ్స్ బాండ్ చిత్రంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 రికార్డులకు ఎక్కింది. 1966లో ఈ సినిమా విడుదలైన సంచలన విజయం నమోదు చేసింది.

6 /6

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన తొలి సినిమా 'తేనే మనసులు'. ఆదుర్తి సుబ్బారావు దర్శ సినిమా.. తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం.