Purple Foods: ఈ 5 రకాల పర్పుల్ ఫుడ్స్ తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది

ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మెరుస్తుండాలని ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. చర్మ సంరక్షణకు దోహదపడే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కొన్ని రకాల పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ సాధ్యమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంటుంది.

Purple Foods: ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మెరుస్తుండాలని ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. చర్మ సంరక్షణకు దోహదపడే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కొన్ని రకాల పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ సాధ్యమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంటుంది.

1 /5

బీట్‌రూట్ బీట్‌రూట్ తినడం వల్ల స్వెల్లింగ్ సమస్య దూరమౌతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. హెల్తీ స్కిన్ కోసం  ఇది అద్బుతంగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి.

2 /5

పర్పుల్ క్యాబేజ్ పర్పుల్ క్యాబేజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయంటారు. ఫలితంగా చర్మం నిగనిగలాడేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. 

3 /5

ప్యాషన్ ఫ్రూట్ ప్యాషన్ ఫ్రూట్‌లో పిక్టెనాల్ అనే ప్రత్యేకమైన పోలీఫెనోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మం కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది

4 /5

వంకాయ వంకాయల్ని చాలా రకాల వంటల్లో వాడుతుంటారు. వంకాయ చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాల కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి కావల్సినంతగా లభిస్తుంది.

5 /5

ద్రాక్ష ద్రాక్ష తినడం వల్ల ఎండల్లో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాల్నించి చర్మం దెబ్బతినకుండా కాపాడవచ్చు. ఎండు ద్రాక్ష కూడా తినవచ్చు