Adah Sharma: అరుదైన వ్యాధితో బాధపడుతున్న.. ఎమోషనల్ అయిన ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్..

Bollywood actress Adah sharma: బాలీవుడ్ నటి అదాశర్మ ఇటీవల షాకింగ్ విషయాన్ని బైటపెట్టారు.  తనకు అరుదైన వ్యాధి వచ్చిందని, దీనికి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూనే  షూటింగ్ లలో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది.
 

1 /6

బాలీవుడ్ నటి అదాశర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పారు. తనకు ఎండో మెట్రీయో సిస్ వ్యాధి సొకిందని దీని వల్ల తన శరీరం అనేక మార్పులకు లోనౌతుందని చెప్పుకొచ్చింది.

2 /6

బాలీవుడ్ నటి అదాశర్మ..  దికేరళ ఫైల్స్ సినిమాలో నటించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు . ఇటీవల ఆమెకు తెలుగులో అవకాశాలు తక్కువ కావడంతో హిందీ మూవీలపై కాన్సన్ ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అదాశర్మ.. బస్తర్  మూవీలో నటించారు. ఆ మూవీలో అదా శర్మ.. సైన్యంలో అధికారిణిగా ఆమె నటినంచారు.

3 /6

దికేరళ ఫైల్స్ స్టోరీస్ లో సన్నగా నాజుక్ ఉన్న అదాశర్మ.. బస్తర్ మూవీ కోసం బరువు పెరిగినట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రతిరోజు ఎక్కువగా ఫుడ్ తీసుకునేదని, రోజుకు డజన్ అరటి పండ్లు తినడం, పడుకునే ముందు లడ్డులు తినడం వంటివి చేస్తుండేదని చెప్పుకొచ్చింది.

4 /6

ఈ నేపథ్యంలో..శరీరంలో అనేక మార్పులు వస్తుండేవని ఆమె అదా చెప్పుకొచ్చింది. దీనికి తోడు అరుదైన వ్యాధి వల్ల తనకు నడుము నొప్పి వేధించేదని బాధపడింది. 

5 /6

దాదాపుగా 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ సమస్య వేధించేదని, దీని వల్ల నరకం అనుభవించినట్లు నటి బాధపడింది. అంతేకాకుండా.. విపరీతంగా బ్లీడింగ్ కావడం వల్ల చాలా సార్లు షూటింగ్ లకు అస్సలు ఓపిక ఉండేది కాదని తన వేదనను చెప్పుకుంది. 1920 మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బామ.. హర్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యారు.

6 /6

ఈ క్రమంలో ఆమె కొన్ని రోజులుగా ఎండో మెట్రీయో సిస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పింది.  నటి సమంతా కూడా ఇటీవల అరుదైన వ్యాధితో చాలా నరకం అనుభవించారు. అదే విధంగా.. పుష్ప విలన్ ఫహద్ సాహిల్ సైతం.. అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివ్ డిజార్డర్ ( ADHD) అనే  వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు.