COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?

Side effects of Covid-19 vaccine: కరోనావైరస్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.

  • Jan 15, 2021, 23:36 PM IST

కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంతానం కలగరనేది ( Infertility ) కేవలం అపోహేనా లేక నిజమా అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్న  నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

1 /6

కరోనా వ్యాక్సిన్‌పై వస్తున్న వదంతులకు, అపోహలకు ( Myths of COVID-19 vaccine ) చెక్ పెడుతూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్ ద్వారా గ్రాఫిక్స్ రూపంలో స్పందించారు.

2 /6

COVID-19 vaccine తీసుకున్న తర్వాత కొంతమందిలో కొద్దిపాటి జ్వరం, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.

3 /6

కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏవి అయినా.. అవి దీర్ఘకాలం పాటు ఉండవని, కొద్ది రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.

4 /6

Coronavirus vaccine కారణంగా సంతానం కలిగే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందనే ప్రచారాన్ని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు.

5 /6

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం అధికారికంగా అందించే సమాచారాన్ని తప్ప ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే అనధికారిక సమాచారాన్ని విశ్వసించకూడదని కేంద్ర మంత్రి ( Union Health Minister Harsh Vardhan ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

6 /6

కరోనా వైరస్‌కి చెక్ పెట్టేందుకు తయారైన వ్యాక్సిన్ వినియోగంపై వస్తున్న వదంతులకు, అపోహలకు ఈ విధంగా సమాధానం చెప్పిన కేంద్రం