Pranayama Benefits: ‘శ్వాస మీద ధ్యాస’ మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రపంచానికి యోగా(Yoga)ను పరిచయం చేసిన దేశం భారతదేశం కనుక ఇలాంటి ప్రాచీన విద్య మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Benefits Of Pranayama: ‘శ్వాస మీద ధ్యాస’ మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రపంచానికి యోగా(Yoga)ను పరిచయం చేసిన దేశం భారతదేశం కనుక ఇలాంటి ప్రాచీన విద్య మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రాణాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. వీరిలో ఏకాగ్రత సైతం పెరుగుతుందని పలు అధ్యయనాలలో తేలింది. Also Read: Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి
ప్రాణాయామం సుదీర్ఘంగా నెలల తరబడి చేస్తున్న వారికి ఒంట్లోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. అధిక శారీరక శ్రమ చేయకుండా బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఇది చక్కటి పరిష్కార మార్గం.
ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. తద్వారా శరీరంలోని పలు అవయవాలు ఏ ఇబ్బంది లేకుండా, మునుపటి కన్నా చురుకుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఏర్పడే అధిక ఒత్తడికి ప్రామాయామం పరిష్కారం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. Also Read: 5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు
అధిక రక్తపోటు(High BP) సమస్యతో బాధపడేవారు ప్రాణాయామం చేయడం మంచిది. ప్రాణాయామం చేయడం వల్ల రక్తపోటు(Blood Pressure) సమస్య తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండటం వల్ల గుండెపోటు, గుండె జబ్బులు, ఇరత్రా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ప్రాణాయామం కొంతమేర నియంత్రిస్తుంది. Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?