February Bank Holiday Alert!: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలెర్ట్.. ఫిబ్రవరి నెలలో బ్యాంకులు 14 రోజులు పనిచేయవు. రెండో, నాలుగో శనివారంతోపాటు ప్రతి ఆదివారాలు కలిపి 14 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఏ రోజు బ్యాంకులు పనిచేస్తాయి ముందుగానే తెలుసుకోండి.
February Bank Holiday Alert!:ఏ లావాదేవీలు చేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అందుకే బ్యాంకులు ఓపెన్ ఉన్నాయా? ముందుగానే కస్టమర్లు తెలుసుకోవాలి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు వీకెండ్ సెలవులు 6, కొన్ని పండుగలు ఇతర ప్రత్యేక కార్యాక్రమాల నేపథ్యంలో 8 రోజులు మొత్తంగా 14 రోజులు పనిచేయవు. అయితే, ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆర్‌బీఐ గైడ్‌లైనన్స్ ప్రకారం బ్యాంకులకు సెలవులు వస్తాయి.
ఫిబ్రవరి నెలలో పండుగలు.. ఫిబ్రవరినెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. మీకు బ్యాంకులకు ఏవైనా పర్సనల్ లేదా ప్రొఫెషనల్ పనులు ఉంటే ముందుగానే బ్యాంకులు ఓపెన్ ఉన్నాయా? లేదా? తెలుసుకోండి. అయితే, బ్యాంకులు బంద్ ఉన్నా కానీ, ఫోన్ లేదా నెట్ బ్యాంకింగ్‌తో పేమెంట్స్ చేసుకోవచ్చు.
2025 ఫిబ్రవరి బ్యాంకు సెలవులు.. ఫిబ్రవరి 3వ తేదీ సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బంద్. ఫిబ్రవరి 11 వ తేదీ తైపూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా బ్యాంకులు సిమ్లాలో బంద్ ఉంటాయి.
ఫిబ్రవరి 15వ తేదీ రోజు లోయ్ ఎన్‌గై నీ సందర్భంగ ఇంపాల్‌లో బంద్. ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
ఫిబ్రవరి 20వ తేదీ స్టేట్ డే సందర్భంగా ఐజ్వాల్, ఈటానగర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, కన్పూర్, శ్రీనగర్, తిరువనంతపురం, రాంచీ, లక్నోతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
బ్యాంకు వీకెండ్ హాలిడేస్... ఫిబ్రవరి 2 ఆదివారం. 8,9 రెండో శనివారం,ఆదివారం బంద్ ఉంటాయి. ఫిబ్రవరి 16 ఆదివారం, 22, 23 నాలుగో శనివారం, ఆదివారం సందర్భంగా బ్యాంకులకు బంద్. మొత్తం బ్యాంకులకు ఫిబ్రవరి నెలలో 14 రోజులు సెలవులు వస్తున్నాయి.