Sankranthiki Vasthunnam 2nd Day Collection: వెంకటేష్ గత కొన్నేళ్లుగా సోలో హీరోగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేస్తుండటంతో వెంకీ పనైపోయిందనుకున్నారు అందరు. అంతేకాదు గతేడాది విడుదలైన ‘సైంధవ్’ మూవీ సంక్రాంతి సందర్బంగా విడుదలై కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇలాంటి టైమ్ లో వెంకటేష్... తనకు గతంలో వరుస హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతి బరిలో వచ్చి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Sankranthiki Vasthunnam 2nd Day Collection: 2025 సంక్రాంతి బరిలో అతి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు అందించే దిశగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా తొలి రోజే.. రూ. 45 కోట్ల గ్రాస్ తో 70 శాతం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ను రికవరి చేసింది. అంతేకాదు వెంకటేష్ గత సినిమా కంటే ఎన్నో రెట్లు అధికంగా వెంకీ, అనిల్ రావిపూడి బ్రాండ్ ఈ సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి.
తాజాగా రెండో రోజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రెండో రోజున అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. కొన్ని చోట్ల మూత పడ్డ థియేటర్స్ ను ఈ సినిమా కోసం తెరుచుకోవడం విశేషమనే చెప్పాలి. మొత్తంగా మౌత్ టాక్ తో ఈ సినిమా రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 77 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాకు బుక్ మై షో సహా ఇతర పోర్టల్స్ లో దాదాపు 80 శాతం బుకింగ్స్ అవుతుంటే.. ఆఫ్ లైన్ లో కూడా టికెట్స్ తెగుతున్నాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్ లో జనాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఎగబడుతున్నారు. ఆ సినిమాకు టికెట్ దొరకని వాళ్లు మాత్రమే ఇతర సినిమాలకు వెళుతున్నారు.
మొత్తంగా రెండు రోజుల్లో దాదాపు మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 92 శాతం రివకరీ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా .. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో పాటు వెంకీ మామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది. అంతేకాదు ఈ రోజు వసూల్లతో ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం పక్కా అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీ మామ కెరీర్ లో మూడో రూ. 100 కోట్ల గ్రాస్ మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎపిక్ రికార్డు సాధించబోతుంది. ఇక సోలో హీరోగా వెంకటేష్ కు తొలి రూ. 100 కోట్ల చిత్రం ఇదే అవుతుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వెంకీ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్, ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు. నిజంగా సవితులా అనే రేంజ్ లో యాక్ట్ చేసి మెప్పించారు. ఇక వీళ్లిద్దరి మధ్య నలిగే పాత్రలో వెంకటేష్ తనదైన కామెడీ పండించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు పెద్దగా కథ లేకపోయినా.. తనదైన కామెడీ, స్క్రీన్ ప్లేతో లాజిక్ ను పక్కన పెట్టి పూర్తి హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ గా నిలువబోతుంది. ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో చూడాలి.