Prabhas Recent Movies Collections: 'సలార్' సహా ప్రభాస్ రీసెంట్ మూవీస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ డీటెల్స్..

Prabhas Recent Movies Collections: బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగింది. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతూ వస్తోంది.గతేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన సలార్ సహా ప్రభాస్ గత 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత షేర్ వసూలు చేసిందంటే..

1 /7

సలార్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 337.43 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో రూ. 217.13 కోట్ల షేర్ రాబట్టింది.

2 /7

ఆదిపురుష్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించి ఈ సినిమా ఫ్లాప్‌ టాక్‌తో కూడా రూ. 200 కోట్ల షేర్ రాబట్టం విశేషం. తెలుగులో రూ. 109.50 కోట్ల షేర్ రాబట్టింది.

3 /7

రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాధే శ్యామ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. తెలుగులో రూ. 72.20 కోట్ల షేర్ రాబట్టింది.

4 /7

సాహో: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 218.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో మెజారిటీ వాటా హిందీ నుంచే దక్కడం విశేషం. తెలుగులో మాత్రం రూ. 112.73 కోట్ల షేర్ రాబట్టింది.

5 /7

బాహుబలి 2: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 860 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రేంజ్ మన దేశంలో రాబట్టిన సినిమా ఏది లేదు. అంతేకాదు తెలుగులోనే కాదు మన దేశంలో హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే రూ. 320 కోట్ల షేర్ రాబట్టింది.

6 /7

బాహుబలి 1: రాజమౌళితో చేసిన బాహుబలి 1 సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 304 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా స్మాష్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే రూ. 194 కోట్ల షేర్ రాబట్టింది.

7 /7

మొత్తంగా ప్రభాస్ లాస్ట్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్  కలిపితే రూ. 1696.18 కోట్ల షేర్ వచ్చింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో కేవలం 831.56 కోట్లతో ఎవరికీ అందనంద ఎత్తులో ఉన్నాడు.