Uric Acid Detoxifying Fruits: బీపీ, మధుమేహం మాదిరి యూరిక్ యాసిడ్ సమస్య ఈరోజుల్లో చాలామందిని వేధిస్తోంది. దీని బారిన పడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకుని ఇంటి చిట్కాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ఈరోజు మనం యూరిక్ యాసిడ్‌ను డిటాక్సిఫై చేసే పండ్లు గురించి తెలుసుకుందాం. అవి మన శరీరంలోని సిరల్లో పేరుకుపోయిన యూరిక్ యాడిన్ ను తక్షణమే బయటకు పంపించేస్తాయి..
ఉసిరి.. ఉసిరి కాయలో ఎన్నో ఔషధగుణాలున్నాయని మనందరికీ తెలిసిందే. దీన్ని జుట్టు సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. అయితే, శరీరంలోని యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో కూడా ఎంతో ప్రభావవంతంగా ఉసిరికాయన పనిచేస్తుంది. ముఖ్యంగా పులుపుగా ఉండే ఉసిరి ఉదయమే పరగడుపున తీసుకుంటే మంచిది. సిరల్లో పేరుకున్న యూరిక్ యాసిడ్‌కు తక్షణమే చెక్ పెట్టే గుణం దీనికి ఉంది.
కమలపండు.. యూరిక్ యాసిడ్ ను డిటాక్సిఫై చేసే మరో సిట్రస్ పండు కమలపండు. దీన్ని నారింజ, ఆరెంజ్ అని కూడా పిలుస్తాం. అయితే ఇది కూడా ప్రభావవంతంగా యూరిక్ యాసిడ్‌ను శరీరంలో నుంచి బయటకు పంపించేస్తుంది. ఈ పండు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ అటాక్స్ ను సులభంగా తగ్గించేస్తుంది.
పైనాపిల్.. కిడ్నీ ఆరోగ్యానికి పైనాపిల్ జ్యూస్ ఎంతో బాగా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టే మరో పులుపు పండు కూడా పైనాపిల్. ఇది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ యూరిక్ యాసిడ్ సమస్యను సమర్థవంతంగా పనిచేస్తుంది.
ద్రాక్ష.. ద్రాక్ష అన్ని సీజన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో మూడు రంగులు ఉంటాయి. పచ్చగ్రేప్, నలుపు, ముదురు రంగు గ్రేప్స్ ప్రతి సీజన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే, ద్రాక్ష కూడా యూరిక్ యాసిడ్ సమస్యకు తక్షణమే చెక్ పెడుతుంది.
నిమ్మకాయ.. నిమ్మకాయ కూడా ప్రతి సీజన్లో దొరుకుతుంది. మన వంటింట్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఉదయం పరడగడుపున గోరువెచ్చని నీటితో నిమ్మరసం వేసుకుని తాగాలి. నిమ్మకాయ యూరిక్ యాసిడ్ సమస్యను ఎంతో ప్రభావవంతంగా తరిమేస్తుంది.