Game Changer Ott Streaming Date:‘గేమ్ చేంజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్..

Game Changer Ott Streaming Date: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.

1 /5

Game Changer Ott Streaming Date:సంక్రాంతి కానుకగా రిలీజైన   రామ్ చరణ్  సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఎఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ పాత్రలో నటించి మెప్పించారు.

2 /5

శంకర్ ఈ సినిమాను ఒకప్పటి ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ ను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించాడు. ఎపుడో 90 వ దశకంలో  రావాల్సిన ఈ సినిమాను ఈ జనరేషన్ లో తెరకెక్కించాడు. ఇప్పటి జనరేషన్ కు ఇప్పటి కాలానికి తగ్గట్టు తెరకెక్కించలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. 

3 /5

ఇక 'గేమ్ చేంజర్' సినిమా డిజాస్టర్  వెనుక వంద కుట్రలు దాగున్నాయి. మూవీలో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాల కారణంగా కూడా ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు.  పైగా సినిమా విడుదలైన రోజే.. పైరసీ బారిన పడటం కూడా ఈ సినిమాకు తీరని నష్టాన్ని చేకూర్చింది.

4 /5

మొత్తంగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా జనవరి 31న హిందీలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం.

5 /5

ఇక ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ 50 రోజుల తర్వాత ఫిబ్రవరి 20న స్ట్రీమింగ్ కు రానున్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తంగా థియేట్రికల్ గా ఈ సినిమాను మిస్ అయిన వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.