Rakul Preet Singh: కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్‌‌.. ట్వీట్

Twitter/@Rakulpreet) 

  • Dec 22, 2020, 16:35 PM IST

Rakul Preet Singh Tests Positive For CoronaVirus | కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, దేశాధినేతలతో పాటు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించింది. నేటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అయితే ప్రభావం కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం. ఈ క్రమంలో తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ కరోనా వైరస్ బారిన పడ్డారు. (Photo: Twitter/@Rakulpreet) 

1 /4

Rakul Preet Singh Tests Positive For CoronaVirus | కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, దేశాధినేతలతో పాటు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించింది. నేటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అయితే ప్రభావం కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం. ఈ క్రమంలో తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ కరోనా వైరస్ బారిన పడ్డారు. (Photo: Twitter/@Rakulpreet)  Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్

2 /4

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలిపింది.

3 /4

తనకు కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ చేయించుకోగా, కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేకోవాలని సూచించింది. ఇటీవల నటి, హోస్ట్ మంచు లక్ష్మి హీరోయిన్ రకుల్‌ను కలిసినట్లు తెలిసిందే.

4 /4

త్వరలోనే కరోనాను జయించి మూవీ షూటింగ్‌, ఇతరత్రా కార్యక్రమాలలో పాల్గొంటానని రకుల్ ప్రీత్ ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల ఈమెను కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. (Photo: Rakul Preet Singh Twitter) Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?