Pushpa 2 Bollywood Collections: బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించిన పుష్ప 2.. తక్కువ టైమ్ లో హిందీలో రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్స్..

Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే వసూళ్ల నుంచే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం  పుష్ప రాజ్ చేస్తోన్న వసూళ్ల సునామీ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. నిన్న శనివారంతో బాక్సాఫీస్ దగ్గర  దగ్గర  10 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు తక్కువ టైమ్ లోనే మన దేశంలో హిందీ వెర్షన్ లో  రూ. 500 కోట్ల నెట్  వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులను పాతర వేసింది.

1 /6

Pushpa 2 Hindi Collections: తగ్గేదేలే అని ఏ సమయాన పుష్ప రాజ్ అన్నాడో కానీ.. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ పై పుష్పరాజ్ వసూళ్ల యాత్ర కనపడటం లేదు. తొలి రోజు నుంచి అక్కడ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్స్ పుష్ప రాజ్ ను నెత్తిన పెట్టుకున్నారు.  

2 /6

అంతేకాదు పుష్ప రాజ్ నటనకు వసూళ్ల వర్షం కురిస్తున్నారు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో తొలి రోజు  అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అక్కడ ఫస్ట్ డేనే రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టింది.

3 /6

అంతేకాదు ఫస్ట్ వీక్ లోనే పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 433.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అంతేకాదు ఫస్ట్ వీక్ తర్వాత శుక్రవారం హిందీలో రూ. 27.50 కోట్ల నెట్ కలెక్షన్స్.. రెండో శనివారం రూ. 46.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది.

4 /6

ఇప్పటి వరకు హిందీలో ఏ సినిమా రెండో శనివారం ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు. అంతేకాదు కేవలం 10 రోజుల్లో అత్యంత తక్కువ సమయంలో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా పుష్ప రాజ్ రికార్డు క్రియేట్ చేసాడు.

5 /6

ఇప్పటి వరకు బాలీవుడ్ లో బాహుబలి 2, పఠాన్, గదర్ 2, జవాన్, స్త్రీ 2 సినిమాలు మాత్రం రూ. 500 కోట్ల నెట్ వసూళ్ల క్లబ్బులో ప్రవేశించాయి. బీ టౌన్ లో 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన 6వ చిత్రంగా పుష్ఫ 2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజుతో ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం దాదాపు ఖాయమనే చెప్పాలి.

6 /6

అంతేకాదు పుష్ప 2 బుక్ మై షోలో 15 మిలియన్ టికెట్స్ సేల్ అయిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమా రూ. 600 కోట్ల షేర్ (రూ. 1200 కోట్ల) గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రోజు వసూల్లతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం గ్యారంటీ అని చెప్పాలి.