Chandrababu Revanth Reddy: మళ్లీ కలిసిన గురుశిష్యులు.. దావోస్‌లో చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి భేటీ!

Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్‌ ఎయిర్‌పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

1 /5

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో  పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. జ్యురిచ్‌ విమానాశ్రయంలో వీరిద్దరూ కలుసుకున్నారు.

2 /5

జ్యూరిచ్ విమానాశ్రయంలో తెలుగు వారితో మాట్లాడిన అనంతరం చంద్రబాబు, రేవంత్‌ కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

3 /5

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు మధ్య చర్చ జరిగింది.

4 /5

వీరి సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, శ్రీధర్‌ బాబు, నారా లోకేశ్ ఇరు రాష్ట్రాల అధికారులు ఉన్నారు.

5 /5

దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను విజ్ఞప్తి చేశారు.