Dangerous Than Snake: మీ ఇంట్లో నివసించే ఈ చిన్న జీవి పాము కంటే ప్రమాదకరం! ఏటా 10 లక్షల మందిని చంపేస్తుంది!!

Dangerous Than Snake: సాధారణంగా ఏదైనా జీవి వల్ల ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైతే ఎవరైనా అది కచ్చితంగా పులి, సింహం లేదా ఇతర క్రూరమృగాలు అయి ఉండొచ్చు. లేదా విషజాతులకు చెందిన పాము, తేలు అనుకుంటారు. కానీ, మన ఇంట్లో ఉండే ఓ జీవి వల్ల ఏటా మిలియన్‌ మంది చనిపోతున్నారట.
 

1 /5

అవును ఇది నిజం.. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేటతెల్లం చేసింది. WHO ప్రకారం రేబిస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 60,000 మంది మరణిస్తున్నారు. 1.5 లక్షల మంది పాము కాటుతో మరణిస్తున్నారు.అయితే, వీటికంటే ఎక్కువ మరో జీవి వల్ల చనిపోతున్నారు.   

2 /5

మన ఇంట్లో ఉండే ప్రాణాంతకమైన జంతువు దోమ. కొన్ని పరిశోధనల ప్రకారం దోమ కాటుతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మంది మరణిస్తున్నారు. దీన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నిత్యం మన ఇంట్లో తిరుగుతున్న దోమలు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.  

3 /5

 డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 2021 లో మలేరియా బారినపడి ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా మరణించారు. ఈ ప్రాణాంతక దోమల వల్ల మలేరియా వస్తుంది. ఇది మన ఇంటి చుట్టు అపరిశుభ్రమైన వాతావరణం, నీటిని నిల్వ ఉంచితే దోమలు పెరిగిపోతాయి. దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమలు మలేరియాను ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపింపజేస్తాయి.  

4 /5

ముఖ్యంగా ఈ దోమకాటుకు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి ఉన్నవారు మృత్యువాత పడుతున్నారు. ఎందుకంటే మలేరియా వీరికి ప్రాణాంతకం. WHO ప్రకారం ఆఫ్రికాలో 80 శాతం మలేరియా మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంభవించాయి. ఇలా ఇతర దేశాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి.  

5 /5

అంతేకాదు, ఈ ప్రాణాంతక దోమ వల్ల కేవలం మలేరియా మాత్రమే కాదు డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్, ఫైలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఇలా దోమలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చావుకు కారణం అవుతున్నాయి. అందుకే మస్కిటో రెప్పలెంట్స్‌ వాడటంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి..