Rain Alert: ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాలో అతిభారీ వర్షాలు..

Rain Alert In Andhra Pradesh: గత కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడింది. అండమాన్‌ సముద్రంలో నేడు ఆవర్తనం ఏర్పడనుంది. ఇది అతి భారీ వర్షాలకు కూడా దారితీస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 

1 /5

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజుల్లో ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి  

2 /5

అండమాన్‌ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. మరో రెండు రోజుల్లో ఇది అల్పపీడనంగా మారనుంది. దీంతో 24వ తేదీ రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మోస్తారు, మరో రెండు రోజుల తర్వాత అతిభారీ వర్షాలు పడనున్నాయి.  

3 /5

ఇదిలా ఉండగా తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి పెరుగుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు సెల్సియెస్‌ తక్కువ నమోదవుతుంది. దీంతోపాటు బలమైన గాలులు కూడా ఈశాన్యం, తూర్పు నుంచి వీస్తున్నాయి.  

4 /5

వాతావరణ శాఖ ఇప్పటికే ప్రజలను ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది.  

5 /5

ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఏపీవ్యాప్తంగా అల్ప పీడనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా తీవ్ర వర్షాలు కూడా కురుస్తున్నాయి. స్కూళ్లకు కూడా సెలవులు ఇస్తున్నారు. తీరప్రాంత ప్రజలను అలెర్ట్‌ చేస్తోంది వాతావరణ శాఖ.