Kathuri Bail: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి బెయిల్ మంజూరు అయింది. బుధవారం ఆమెకు ఎగ్మూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నటి కస్తూరికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సినీ నటి కస్తూరిని ఇటీవలె హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను చెన్నైకు తరలించారు. తెలుగు వారిపై ఈమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశారు. అప్పటికే కస్తూరి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరించింది.
దీంతో పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో ఆమెను పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆమెకు పిటిషన్ పై విచారణ జరిపి బుధవారం బెయిల్ మంజూరు చేశారు.
చెన్నైలో స్థిరపడ్డా తెలుగువారిపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కస్తూరి శంకర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె కొన్ని రోజులపాటు పరారీలో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా తన ఆటిస్టిక్ బిడ్డను చూసుకోవాలని కోర్టు వారికి దాఖలు చేయగా బుధవారం కస్తూరికి బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 4 కింద ఆమె తెలుగువారిని కించపరిచినందుకు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన కస్తూరి శంకర్. 'గృహలక్ష్మి'గా తెలుగువారికి కూడా దగ్గరయ్యారు. అన్నమయ్య, భారతీయుడు ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు. ఇంతలోనే ఓ కార్యక్రమంలో ఆమె తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.