Kichcha sudeep: దర్శన్ పై హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కిచ్చా సుదీప్..

Renuka swami murder case: రేణుక స్వామి మర్డర్ కేసు దేశంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై కన్నడ సినిపరిశ్రమలోని వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా, హీరో సుదీప్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.
 

1 /6

కర్ణాటకలో రేణుక స్వామి అనే ఫ్యాన్ ను.. దర్శన్, పవిత్ర గౌడ్ లు కలిసి అత్యంత దారుణాంగా చంపారని విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 16 మంది వరకు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో కోర్టు వీరికి పోలీసులకు కస్టడీకీ అప్పగించింది.. 

2 /6

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తాజాగా.. కన్నడ హీరో సుదీప్ తీవ్రంగా స్పందించాడు. రేణుక స్వామి భార్యకు,పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఘటన జరక్కుండా ఉండాల్సింది అని.. దీని వెనకాల ఎంతటి వారున్న కూడా చర్యలు తీసుకొవాలని పోలీసులను కోరాడు.

3 /6

ఒకరిద్దరు చేసిన తప్పులను ఇండస్ట్రీకి ఆపాదించోద్దని హీరో సుదీప్ కోరారు.  ఆల్రేడీ పెళ్లి జరిగిన కూడా.. పదేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు అనేక మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయినట్లు సుదీప్ పేర్కొన్నారు. రేణుక స్వామికి జస్టిస్ జరగాలన్నదే తమ డిమాండ్ అన్నారు.

4 /6

ఇక రేణుక స్వామిని చిత్రదుర్గ్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, బెంగళూరులో చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు విచారణలో బైటపడింది. తాను.. వెజీటెరియన అన్న కూడా.. చికెన్ బిర్యానీ నోట్లో కుక్కి మరీ కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చారని విచారణలో బైటపడింది. 

5 /6

దర్శన్ తూగుదీప.. తాను రెండు దెబ్బలు మాత్రమే కొట్టానని , ఆ తర్వాత ఏంజరిగిందో తెలియదని కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. పవిత్ర గౌడ.. ఈ విషయం, దర్శన్ కు చెప్పకపోతే.. ఈ ఘోరం జరిగేది కాదంటూ పోలీసులు ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన ఇప్పుడు కన్నడ నాట తీవ్ర దుమారంగా మారింది.

6 /6

ప్రస్తుతం వీరి విచారణ కొనసాగుతుంది. పోలీసులు అనేక టెక్నికల్ డాటాలను సంపాదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రేణుక స్వామిని, పవిత్ర గౌడతో చెప్పుతో కొట్టినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.